Nampally Court : మంత్రి ఉత్తమ్కు బిగ్ షాక్ .. నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి నాంపల్లి కోర్టు బిగ్ షాకిచ్చింది. ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన కేసులో విచారణకు హాజరు కాకపోవడంతో నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ఆయనకు గురవారం నోటీసులు జారీ చేసింది.  

New Update
uttam namplly court

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి నాంపల్లి కోర్టు బిగ్ షాకిచ్చింది. ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన కేసులో విచారణకు హాజరు కాకపోవడంతో నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ఆయనకు గురవారం నోటీసులు జారీ చేసింది.   గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ సభలు నిర్వహించి, ట్రాఫిక్ జామ్ చేసి ప్రజలను ఇబ్బంది పెట్టారని ఉత్తమ్ కుమార్ రెడ్డిపై పలు కేసులు నమోదు చేశారు పోలీసులు.

వారెంట్ జారీ

అయితే ఈ కేసు విచారణకు ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరు కాకపోవడంతో వారెంట్ జారీ చేసింది కోర్టు.  తదుపరి విచారణను జులై 16వ తేదీకి వాయిదా వేసింది కోర్టు. 16వ తేదీన ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పకుండా కోర్టులో హాజరు అవ్వాలని నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశించింది. లేనిపక్షంలో చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించింది.  

Advertisment
తాజా కథనాలు