/rtv/media/media_files/2025/10/02/india-women-team-2025-10-02-22-52-47.jpg)
ప్రస్తుతం భారత్, శ్రీలంకల్లో మహిళల వన్డఏ వరల్డ్ కప్ జరుగుతోంది. ఇందులో ఆదివారం నాడు టీమ్ ఇండియా, పాకిస్తాన్ తలడనున్నాయి. ఈ మ్యాచ్ కొలంబోలో జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కు ముందు, తరువాత కూడా భారత జట్టు..పాకిస్తాన్ కు షేక్ హ్యాండ్ ఇస్తుందా లేదా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా ఉంది. ఈ ప్రశ్నకు బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ స్పందించారు. డైరెక్ట్ గా ఇస్తుంది, లేదు అని చెప్పకుండా...వారం రోజుల్లో పరిస్థితులు ఏం మారలేదు కదా అని అన్నారు.
ఇప్పుడే ఏం చెప్పలేం..
కొలంబోలో భారత్, పాకిస్తాన్ మహిళలు జట్టు తలపడేనాటికి ఆసియా కప్ ముగిసి వారం రోజులు మాత్రమే అవుతుంది. అయితే ఈ లోపు పరిస్థితులు ఏమీ మారలేదు. శత్రుదేశంతో సంబంధాలు అలానే ఉన్నాయి. మరోవైపు షేక్ హ్యాండ్ విషయంపై తానేమీ ముందుగానే అంచనాలు వేయలేనని దేవజిత్ అన్నారు. అయితే మ్యాచ్ లో ఎంసీసీ నిబంధనలను మాత్రం కచ్చితంగా పాటిస్తామని తెలిపారు. మ్యాచ్ తర్వాత కరచాలనం, ఆలింగనం వంటివి ఉంటాయా.. అంటే మాత్రం నేనేమీ చెప్పలేను అని సైకియా వ్యాఖ్యానించారు.
అయితే మరోవైపు పాక్ తో మ్యాచ్ లో టాస్ అప్పుడు కానీ, తరువాత కానీ భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ ప్రత్యర్థులకు షేక్ హ్యాండ్ ఇవ్వరని వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు బీసీసీఐ నుంచి జట్టుకు ఆదేశాలు అందినట్లు బోర్డు అధికారి ఒకరు వెల్లడించారని పీటీఐలో కథనం వచ్చింది. మరవైపు ఈసారి మహిళ వరల్డ్ కప్ కు భారత్ ఆతిథ్యం ఇస్తోంది. కానీ పాకిస్తాన్ మాత్రం తన మ్యాచ్ లు అన్నింటినీ శ్రీలంకలో ఆడుతోంది. ఎందుకంటే వారం రోజు క్రితం ముగిసిన ఆసియా కప్ కు పాకిస్తాన్ హోస్ట్, కానీ భారత పురుషుల జట్టు పాక్ వెళ్ళనని చెప్పడంతో...మొత్తం టోర్నీని యూఏఈకు షిఫ్ట్ చేశారు. దానికి ప్రతిగా ఇప్పుడు పాక్ మహిళల జట్టు భారత్ కు రావడం లేదు. అందుకే వీరి మ్యాచ్ లు అన్నీ శ్రీలంక వేదికల మీద నిర్వహిస్తున్నారు.