BCCI సంచలన నిర్ణయం..ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్లు ఇక ఉండవు?

కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి ఘటనతో భవిష్యత్తులో పాకిస్తాన్‌తో ఎలాంటి మ్యాచ్‌లు ఆడవద్దని బీసీసీఐని అభిమానులు కోరుతున్నారు.  దీనిపై బీసీసీఐ కార్యదర్శి రాజీవ్ శుక్లా స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం బీసీసీఐకి ఏది చెబితే అది జరుగుతుందన్నారు.

New Update
ind-vs-pak

ind-vs-pak

కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత దేశవ్యాప్తంగా ఆగ్రహ వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై క్రీడా రంగం తరుపున మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ నుండి నీరజ్ చోప్రా వరకు ప్రతి ఒక్కరూ దీనిని తీవ్రంగా ఖండించారు. అయితే భవిష్యత్తులో పాకిస్తాన్‌తో ఎలాంటి మ్యాచ్‌లు ఆడవద్దని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ)ని అభిమానులు కోరుతున్నారు.  

Also read :   అఘోరీకి బిగ్ షాక్.. న్యాయమూర్తి ఆదేశాలతో లింగ నిర్ధారణ పరీక్షలు.. ఏం తేలిందంటే?

రాజీవ్ శుక్లా విచారం

పహల్గాం సంఘటనపై బీసీసీఐ కార్యదర్శి రాజీవ్ శుక్లా విచారం వ్యక్తం చేశారు.  బాధితులకు అండగా నిలుస్తున్నామని అన్నారు. భారత జట్టు ఇప్పుడు పాకిస్థాన్‌తో ఆడదా అని రాజీవ్ శుక్లాను మీడియా అడిగినప్పుడు కేంద్ర ప్రభుత్వమే ఈ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ప్రభుత్వం బీసీసీఐకి ఏది చెబితే అది జరుగుతుందని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మాత్రమే తాము ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం లేదని, భవిష్యత్తులో కూడా అలాగే ఉంటామని బోర్డు ఉపాధ్యక్షుడు అన్నారు. 

ఇక ఐసీసీ ఈవెంట్ల విషయానికొస్తే, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) కారణంగా మేము వాటిలో ఆడతున్నామని తెలిపారు. కాగా ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా దుబాయ్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో టీం ఇండియా భారీ తేడాతో గెలిచింది. 2008లో ముంబై దాడి కారణంగా భారత జట్టు పాకిస్తాన్‌కు వెళ్లడం లేదు. 

పహల్‌గామ్ ఉగ్రదాడిని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఖండించారు. తన హృదయం ముక్కలైందన్నారు. బ్రోకెన్ హార్ట్ ఎమోజీని ఆయన తన ఇన్‌స్టాలో క్యాప్షన్‌గా పెట్టారు. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, షారుఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా, అక్షయ్ కుమార్, వరుణ్ ధావన్, అలియా భట్, కరీనా కపూర్ తదితరులు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు.

Also read :  Pahalgam Attack ఏప్రిల్ 22 ఒక చీకటి రోజు:.. ఉగ్రవాద దాడిపై బాలీవుడ్ సెలెబ్రెటీల ట్వీట్లు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు