Pahalgam Attack ఏప్రిల్ 22 ఒక చీకటి రోజు:.. ఉగ్రవాద దాడిపై బాలీవుడ్ సెలెబ్రెటీల ట్వీట్లు

పహల్గామ్ ఉగ్రవాద దాడి పై సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ ట్వీట్ చేశారు. షారుక్ తో పాటు అనుష్కశర్మ, కరీనా కపూర్, అక్షయ్ కుమార్, అనిల్ కపూర్ తదితరులు దాడిపై స్పందించారు.

New Update
pahalgam attack Bollywood stars tweets

pahalgam attack Bollywood stars tweets

Pahalgam Attack జమ్మూ కాశ్మీర్ పహాల్గమ్ దాడి ఘటన యావత్ భారత దేశాన్ని షేక్ చేసింది. మినీ స్విట్జర్ ల్యాండ్ గా పేరొందిన 'పహాల్గమ్' ప్రకృతి అందాలను చూసేందుకు వచ్చిన ఎంతో మంది అమాయక పర్యాటకులు ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులు పర్యాటకులను అత్యంత కిరాతకంగా కాల్చి చంపారు. దేశవ్యాప్తంగా ఈ ఘటనపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. సామాన్య ప్రజల నుంచి సినీ, రాజకీయ ప్రముఖుల వరకు ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నారు. బాధిత కుటుంబాలకు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ ఈ ఉగ్రవాద దాడిపై ట్వీట్ చేశారు. 

షారుక్ ఖాన్ ట్వీట్ 

'పహల్గామ్‌లో జరిగిన అమానవీయ ద్రోహం,  హింసపై  కోపాన్ని వ్యక్తపరచడానికి మాటలు సరిపోవడం లేదు. ఇలాంటి సమయాల్లో, మనం దేవుని వైపు చూస్తూ, దుఃఖంతో  అతలాకుతలమైన కుటుంబాల కోసం ప్రార్థించగలం. ఈ విషాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ దారుణ సంఘటనకు న్యాయం జరిగేలా మనం ఒక దేశంగా ఐక్యంగా నిలబడదాం అని ట్వీట్ చేశారు. 

అనుష్క శర్మ కూడా దీనిపై స్పందిస్తూ..   'కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో అమాయక ప్రజలపై జరిగిన  ఉగ్రవాద దాడి హృదయవిదారకమైనది. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు నా పార్థనలు, సంతాపం తెలియజేస్తున్నాను. 

 

అనుపమ్ ఖేర్ ఈ వార్తను చదివిన తర్వాత ఒక భావోద్వేగ వీడియోను పంచుకున్నారు . ఇది చాలా "తప్పు... తప్పు... తప్పు అని రాశారు. 

"ఈ సమయంలో ప్రపంచం ఉగ్రవాదాన్ని అంతం చేయడం గురించి ఆలోచించాలి.  ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుఃఖ సమయంలో బాధిత కుటుంబాలకు నేను అండగా నిలుస్తున్నాను" అని ట్వీట్ చేశారు సన్నీ డియోలో 

ఈ ఉగ్రదాడి నా గుండెల్ని ముక్కలు చేసింది. మృతుల కుటుంబాలకు నా పార్థనలు తెలియజేస్తున్నాను అని ట్వీట్ చేశారు అనిల్ కపూర్ 

 

telugu-news | cinema-news | latest-news | pahalgam latest news 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు