Sports: వరల్డ్ నంబర్ వన్ ప్లేయర్ పై మూడు నెలల నిషేధం

టెన్నిస్ వరల్డ్ నంబర్ వన్ ప్లేయర్ గా కొత్త ఆటగాడు సినర్ అవతరించాడు. ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ విజేతగా నిలిచిన ఇతను ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. డోపింగ్ ఆరోపణలతో మూడు నెలల పాటూ నిషేధాన్ని ఎదుర్కొననున్నాడు సినర్. 

New Update
tennis

World No.1 Tennis player Sinner

మూడు నెలల క్రితం జనిక్ సినర్ ఆస్ట్రేలియా ఓపెన్ విజేతగా నిలిచి టెన్నిస్ లో వరల్డ్ నంబర్ వన్ ర్యాంకును దక్కించుకున్నాడు. కానీ ఇప్పుడు మూడు నెలల నిషేధాన్ని ఎదుర్కొంటున్నాడు. గతేడాది ఇతనిపై డోపింగ్ ఆరోపణలు వచ్చాయి. అప్పుడే టెస్టులు నిర్వహించారు. పాజిటివ్ అని రిజల్ట్ కూడా వచ్చింది. కానీ శిక్ష నుంచి తప్పించుకున్నాడు. తెలియకుండా జరిగిందని చెప్పడంతో అంతర్జాతీయ టెన్నిస్ ఇంటిగ్రెటీ ఏజెన్సీ సినర్ పై ఏ యాక్షన్ తీసుకోలేదు. 

Also Read : మరో బ్యూటీతో లలిత్ మోదీ రాసలీలలు.. లవర్స్ డే స్పెషల్ పోస్ట్.. ఆ అందగత్తే ఎవరో తెలుసా!

మళ్ళీ ఫ్రెంచ్ ఓపెన్ వరకు నో టెన్నిస్..

అయితే ఇప్పుడు మాత్రం ప్రపంచ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీతో సినర్ ఓ అంగీకారానికి వచ్చాడు. మూడు నెలల నిషేధాన్ని సినర్ అంగీకరించినట్లు సమాచారం. గత వారం నుంచే ఇది అమల్లోకి వచ్చిందని చెబుతున్నారు. ఫిబ్రవరి 9 నుంచి మార్చి 4 వరకు సినర్ ఏ టోర్నీ ఆడేందుకు అర్హత లేదు. ఫ్రెంచ్ ఓపెన్ 2025 మే 25 నుంచి ప్రారంభం కానుంది. అప్పటికి మూడు నెలల నిషేధం ముగుస్తుంది కాబట్టి అందులో ఆ టోర్నీలో సినర్ బరిలోకి దిగుతాడు. మరోవైపు ఐటిఐఏపై విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. ఇందులో ఆటగాళ్ళ స్థాయిని బట్టి నిర్ణయాలు తీసుకొంటున్నారని టెన్నిస్ స్టార్ నిక్ కిర్గియోస్ ఆరోపించారు. ఐటీఐఏ తీరుపై వాడా... కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్‌ ఫర్ స్పోర్ట్ (CAS)లో అప్పీలు చేసింది. అయితే, వాదనలను వచ్చే ఏప్రిల్‌లో వింటామని కాస్‌ చెప్పింది.  

Also Read: అరవింద్ కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. శీష్‌మహల్ విచారణకు ఆదేశం

Advertisment
తాజా కథనాలు