వారేవా.. చెన్నైని వణికించిన ఆటో డ్రైవర్ కొడుకు..

ఐపీఎల్‌ భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లలో మూడు వికెట్లు తీసి విగ్నేష్ పుతుర్ చెన్నై జట్టును వణికించాడు. కేరళకు చెందిన పుతుర్ తండ్రి ఒక ఆటో డ్రైవర్. తల్లి గృహిణి.

New Update
VIGNESH PUTHUR

VIGNESH PUTHUR Photograph: (VIGNESH PUTHUR)

ఐపీఎల్‌లో భాగంగా ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఎంతో హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో  చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ గెలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 155 పరుగుల వద్ద ఆగిపోయింది. ఈ టార్గెట్‌ను చెన్నై సూపర్ కింగ్స్ ఈజీగా చేసేస్తుందని అందరూ భావించారు. కానీ విగ్నేశ్ పుతుర్ దెబ్బకు చెన్నై జట్టు వణికింది.

ఇది కూడా చూడండి: Delhi Railway station :  ట్రైన్ల ఆలస్యంతో కిక్కిరిసిన  ఢిల్లీ రైల్వే స్టేషన్‌!

ఇది కూడా చూడండి: USA: యెమెన్ పై అమెరికా దాడులు..వందల మంది మృతిs

ముంబై ఇండియన్స్ తరఫున విఘ్నేష్ మొదటి మ్యాచ్‌లోనే తన సత్తా ఏంటో చూపించాడు. మెగా వేలంలో ముంబై ఇండియన్స్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. మొత్తం నాలుగు ఓవర్లు వేసి మూడు వికెట్లు తీశాడు. వరుసగా మూడు ఓవర్లలో మూడు వికెట్లు తీసి అంచనాలను ఒక్కసారిగా తారుమారు చేశాడు.

ఇది కూడా చూడండి: Viral video: ఫోన్‌లో IPL మ్యాచ్ చూస్తూ బస్సు నడిపిన డ్రైవర్.. భారీ జరిమానాతోపాటు..!

తండ్రి ఆటో డ్రైవర్..

ముంబై ఇండియన్స్ మ్యాచ్ గెలవకపోయినా కూడా విఘ్నేష్ పుతుర్ మాత్రం ఫ్యాన్స్ హృదయాలను దోచుకున్నాడు. అయితే పుతుర్‌ను ముంబై రూ.30 లక్షలకు సొంతం చేసుకుంది. పుతుర్ కేరళలోని మలప్పురానికి చెందినవాడు. తండ్రి ఆటో డ్రైవర్. తల్లి గృహిణి. అయితే పుతుర్ మొదట్లో పేస్ బౌలింగ్ చేసేవాడు. అయితే ఇతని టాలెంట్‌ను గుర్తించి క్రికెటర్ మహమ్మద్ షెరీఫ్ లెగ్ స్పిన్ ట్రై చేయమని చెప్పాడు. దీంతో ఇప్పుడు పవర్ ఫుల్‌ స్పిన్నర్‌గా మారిపోయాడు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు