/rtv/media/media_files/2025/04/11/0R80VF7GMuCVZMpYqz3W.jpg)
CSK VS KKR
చెన్నై సూపర్ కింగ్స్ మీద కోలకత్తా నైట్ రైడర్స్ ఈజీగా గెలిచేసింది. 104 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా.. 10.1 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కేకేఆర్ బ్యాటర్లు సునీల్ నరైన్ 44, డికాక్ 23 పరుగులతో తమ జట్టుకు విజయాన్నందించారు. చెన్నై బౌలర్లలో అన్షుల్, నూర్ అహ్మద్ చెరో వికెట్ తీశారు. దీంతో చెన్నై ప్లే ఆఫ్స్ ఆశను సజీవంగా పోగొట్టుకున్నట్టయింది.
సొంత గ్రౌండ్ లో చెత్త ప్రదర్శన
కేకేఆర్‌తో చెపాక్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చెత్త బ్యాటింగ్ చేసింది. టాస్ ఓడి బ్యాంటింగ్‌కు దిగిన సీఎస్‌కే నిర్ణిత 20 ఓవర్లలో 103/9 పరుగులు మాత్రమే చేసింది. ఇప్పటికే 4 మ్యాచ్‌ల్లో ఓడిన చెన్నైకి ఈ మ్యాచ్‌లోనూ ఓటమని మూటగట్టుకుంది. చెన్నై బ్యాటర్లలో శివమ్ దూబే (31 నాటౌట్) టాప్ స్కోరర్ గా నిలవగా విజయ్ శంకర్ (29) ఫర్వాలేదనిపించాడు. ఈ సీజన్ లో మొదటిసారి కెప్టెన్ గా చేస్తున్న ధోనీ కేవలం ఒక రన్ మాత్రమే చేశాడు. మిగతా వారిలో రచిన్ 4, కాన్వే 1, రాహుల్ త్రిపాఠి 16, అశ్విన్ 1, జడేజా 0, దీపక్ హుడా 0, నూర్ అహ్మద్ 1, అన్షుల్ 3 పరుగులు చేసి నిరాశపర్చారు. చెన్నై తన సొంత గ్రౌండ్ లోనే ఇంత చెత్త పెర్ఫామన్స్ చేయడంతో అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఇక కోల్‌కతా బౌలర్లలో సునీల్ నరైన్ 3, వరుణ్ చక్రవర్తి 2, హర్షిత్ రాణా 2, మొయిన్ అలీ 1, వైభవ్ అరోరా 1 వికెట్ పడగొట్టారు.
today-latest-news-in-telugu | csk-vs-kkr | IPL 2025 | match
Also Read: Train Tickets: తత్కాల్ టైమింగ్స్ మార్పుపై కేంద్రం క్లారిటీ..