Train Tickets: తత్కాల్ టైమింగ్స్ మార్పుపై కేంద్రం క్లారిటీ..

ట్రైన్ టికెట్స్ తత్కాల్ బుకింగ్ టైమ్ లో మార్పులు చేసినట్లు వస్తున్న వార్తలను కేంద్రం ఖండించింది, ఆ వార్తలు నిజం కాదని తేల్చి చెప్పింది. ఇలాంటివి నమ్మొద్దంటూ పీఐబీ ఫ్యాక్ట్‌చెక్‌ విభాగం సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది.

New Update
South Central Railway To Run Two More Trains From Cherlapally Railway Terminal

South Central Railway To Run Two More Trains From Cherlapally Railway Terminal Photograph: (South Central Railway To Run Two More Trains From Cherlapally Railway Terminal)

తత్కాల్ ట్రైన్ టికెట్ బుకింగ్ వేళల్లో ఎటువంటి మార్పూ లేదని కేంద్ర స్పష్టం చేసింది.  రైల్వే తత్కాల్‌ టికెట్‌ బుకింగ్‌ టైమింగ్స్‌లో మార్పు జరిగిందని.. కొత్త టైమింగ్స్ ఏప్రిల్‌ 15 నుంచి అమల్లోకి వస్తాయని వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో ఇవి సర్క్యులేట్ అవడంతో కొన్ని పత్రికలు, న్యూస్ ఛానెళ్ళు సైతం ఈ వార్తను పబ్లిష్ చేశాయి. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం వీటిని కొట్టిపారేసింది. అవేమీ నిజం కాదని..అబద్ధాలను నమ్మొద్దని చెప్పింది. పీఐబీ ఫ్యాక్ట్‌చెక్‌  విభాగం దీనికి సంబంధించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. తత్కాల్ లేదా ప్రీమియం తత్కాల్ బుకింగ్ లో ఎటువంటి మార్పూ లేదని..ఏజెంట్లకు అనుమతించిన బుకింగ్ సమయాలు మారవని తేల్చిచెప్పింది. 

 

today-latest-news-in-telugu | indian-railways | tickets | train-tatkal-ticket

 

Also Read: AP: గోరంట్ల మాధవ్ కు ఏప్రిల్ 24 వరకు రిమాండ్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు