MI vs LSG: చెలరేగిపోయిన రికిల్టన్, సూర్య.. లక్నో ముందు భారీ టార్గెట్

లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తొలి ఇన్నింగ్స్‌ కంప్లీట్ అయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేశారు. LSG ముందు 216 టార్గెట్ ఉంది. రికిల్టన్ (58), సూర్యకుమార్‌ యాదవ్‌ (54) పరుగులతో చెలరేగారు.

New Update
MI vs LSG

MI vs LSG

లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తొలి ఇన్నింగ్స్‌ కంప్లీట్ అయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేశారు. దీంతో LSG ముందు 216 టార్గెట్ ఉంది. రికిల్టన్ (58), సూర్యకుమార్‌ యాదవ్‌ (54) పరుగులతో చెలరేగారు. 

Also Read: కేంద్రం కీలక నిర్ణయం.. NIA చేతికి పహల్గాం ఉగ్రదాడి కేసు

ఎవరెన్ని పరుగులు చేశారంటే?

వాంఖడే స్టేడియం వేదికగా 45వ మ్యాచ్‌ జరిగింది. టాస్‌ గెలిచిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ ముందుగా బౌలింగ్‌ ఎంచుకుంది. క్రీజులోకి వచ్చిన రికెల్‌టన్‌, రోహిత్‌ శర్మ మొదటి నుంచి దూకుడుగా ఆడారు. వరుసగా ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయారు. ఇలా ఇద్దరు చెలరేగిపోతున్న సమయంలో 33 పరుగుల వద్ద ముంబై జట్టు తొలి వికెట్‌ కోల్పోయింది. రోహిత్‌ శర్మ (12) ఔట్‌ అయ్యాడు. దీంతో 5 ఓవర్లు పూర్తయ్యే సరికి ముంబై ఇండియన్స్‌ 1 వికెట్ నష్టానికి 47 పరుగులు చేసింది. 

Also Read: ఇంటిలిజెన్స్ కీలక సమాచారం.. ఢిల్లీలో 5వేల మంది పాకిస్తానీలు

ఆ తర్వాత రికెల్‌టన్‌ విజృంభించాడు. వాంఖడే స్టేడియంలో పరుగుల వరద పెట్టించాడు. ఇలా 25 బంతుల్లోనే హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 88 పరుగుల వద్ద ముంబై జట్టు రెండో వికెట్‌ కోల్పోయింది. రికెల్‌టన్‌ (58) పరుగులు చేసి వెనుదిరిగాడు. దీంతో 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. అనంతరం 116 పరుగుల వద్ద మూడో వికెట్‌ కోల్పోయింది. విల్‌ జాక్స్‌ ఔట్‌ (29) అయ్యాడు. 

Also Read: భారీ పేలుడు.. 25 మంది స్పాట్ డెడ్ -1,139 మందికి తీవ్ర గాయాలు

అక్కడ నుంచి సూర్యకుమార్‌ యాదవ్‌ గేర్‌ మార్చాడు. వరుస పరుగులు రాబడుతూ ముంబై జట్టుకు మంచి స్కోర్ అందించాడు. ఇలా మొత్తంగా రోహిత్‌ శర్మ (12), రికెల్‌టన్‌ (58), విల్‌ జాక్స్‌ ఔట్‌ (29), తిలక్‌ వర్మ (6), హార్దిక్‌ పాండ్య (5), సూర్యకుమార్‌ యాదవ్‌ ఔట్‌ (54) పరుగులు సాధించారు. లక్నో సూపర్‌ జెయింట్స్‌ బౌలర్లలో మయాంక్‌ యాదవ్‌, అవేశ్‌ ఖాన్‌ చెరో 2 వికెట్లు.. ప్రిన్స్‌ యాదవ్‌, దిగ్వేశ్‌ సింగ్‌ రాఠీ, రవి బిష్ణోయ్‌ చెరో 1 వికెట్‌ చొప్పున తీశారు. 

Also Read: స్టూడెంట్స్తో బలవంతంగా నమాజ్ .. ఏడుగురు టీచర్లపై కేసు!

IPL 2025 | MI vs LSG

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు