Samantha: సమంత తండ్రి జోసెఫ్ ప్రభు మృతి.. ఇన్‌స్టాలో ఎమోషనల్ స్టోరీ టాలీవుడ్ హీరోయిన్ సమంత తండ్రి జోసెఫ్ ప్రభు మృతి చెందారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సామ్ తన ఇన్‌గ్రామ్ అకౌంట్‌లో స్టోరీ పెట్టింది. “నాన్నను ఇక కలవలేను” అంటూ హార్ట్ బ్రేకింగ్ ఏమోజీతో షేర్ చేసింది. అయితే తన తండ్రి మృతికి గల కారణాలను ఆమె వెల్లడించలేదు. By Seetha Ram 29 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సమంతకు ప్రత్యేక గుర్తింపు ఉంది. కెరీర్ ప్రారంభం నుంచి దూసుకుపోయిన సామ్.. చైతుతో విడాకుల తర్వాత ఎన్నో సమస్యలతో సతమతమవుతుంది. ఈ క్రమంలోనే తాజాగా మరో విషాదం ఆమెను చుట్టుముట్టింది. Also Read: పవన్ కళ్యాణ్ ఆగ్రహం.. ఎమ్మెల్యేపై సీరియస్ సామ్ తండ్రి మృతి సామ్ తండ్రి జోసెఫ్ ప్రభు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. “నాన్నను ఇక కలవలేను” అంటూ హార్ట్ బ్రేకింగ్ ఏమోజీతో స్టోరీ పెట్టింది. అయితే తన తండ్రి మృతికి గల కారణాలను వెల్లడించలేదు. Also Read: అప్పుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. ఇప్పుడు బిచ్చగాడు, ఎందుకు అలా? చెన్నైలో జోసెఫ్ ప్రభు, నీనెట్ ప్రభు దంపతులకు సమంత జన్మించారు. ఆమె తండ్రి తెలుగు ఆంగ్లో-ఇండియన్. కాగా సమంత ఎప్పుడూ తన తండ్రి గురించి చెప్తూ ఉండేది. ఆమె జీవితంలో తన తండ్రి ముఖ్య పాత్ర పోషించారని గతంలో చాలా సార్లు చెప్పుకొచ్చింది. Also Read: హైదరాబాద్ లో అరబ్ షేక్ అరాచకం.. 12 ఏళ్ల బాలికలతో కాంట్రాక్ట్ మ్యారేజ్ ప్రతి విషయంలోనూ తన తండ్రి తనకు అండ దండగా ఉన్నాడని, మద్దతుగా నిలిచాడని అప్పట్లో పేర్కొంది. ఇక తన తండ్రి జోసెఫ్ ప్రభు మరణవార్త తెలియడంతో సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు. ఈ మేరకు జోసెఫ్ ప్రభు ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. మరోవైపు సామ్ తండ్రి జోసెఫ్ ప్రభు గతంలో ఫేస్‌బుక్ ద్వారా సామ్-నాగ చైతన్యల పెళ్లిఫొటోలను పంచుకున్నారు. వీరిద్దరి విడాకుల అనంతరం దాదాపు ఏడాది తర్వాత అతడు రియాక్ట్ అయ్యాడు. Also Read: భారత్‌తో కంగారు రెండో మ్యాచ్.. పింక్ బాల్‌కు వేదిక కానున్న అడిలైడ్ చైతు,సామ్ ఫొటోలు పంచుకుంటూ.. గతంపై తన ఆవేదనను వ్యక్తపరిచాడు. వారిద్దరూ విడాకులు తీసుకున్న విషయాన్ని అంగీకరించడానికి తనకు చాలా కాలం పట్టిందని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. #joseph-prabhu #tollywood #samantha మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి