Team India: టీమ్ ఇండియాలో ఆటగాళ్లు, మేనెజ్‌మెంట్ మధ్య అంతర్గత విభేధాలు మొదలైనట్లు తెలుస్తోంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఎంపికపై సీనియర్లు అసహనం వ్యక్తం చేస్తూ ఆయన తీరుపట్ల అసంతృప్తిగా ఉంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గంభీర్ బాధ్యతలు చేపట్టిన మొదటి శ్రీలంక పర్యటనలో వన్డే సిరీస్ ఓటమి, ఆ తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్, రీసెంట్ గా ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో ఘోర పరాభవం వెనక అనేక కారణాలున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇదిలాఉంటే.. మాజీలు సైతం గంభీర్ నిర్ణయాలను వ్యతిరేకిస్తుండటంతోపాటు ఆటగాళ్లు ఎందుకిలా విఫలమవుతున్నారనే అంశంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే మాజీ ఆటగాడు మనోజ్ తివారి కోచ్ గంభీర్ పై సంచలన ఆరోపణలు చేశాడు.
గంభీర్ నిర్ణయాల వల్లే వరుస ఓటములు..
ఈ మేరకు గంభీర్ చెప్పేది వేరు, చేసేది వేరంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. గంభీర్ నిర్ణయాల వల్లే టీమ్ ఇండియా వరుస ఓటముల పాలవుతోందంటూ సంచలన ఆరోపణలు చేశాడు. ‘రిజల్ట్స్ మన కళ్ల ముందేఉన్నాయి. భారత్ వరుసగా మూడు సిరీస్‌లు కోల్పోయింది. బోర్డర్-గావస్కర్ ట్రోఫీ పరిస్థితి దారుణం. గతంలో ఇలా ఎప్పుడూ జరగలేదు. అయితే గెలుపోటములు సహజమే కానీ వరుస ఓటములకు కారణామేంటో చూడాలి. ద్రవిడ్ గొప్ప స్థితిలో నిలబెట్టి వెళ్లిన జట్టుకు గంభీర్ విజయాలను ఎందుకు అందించలేకపోతున్నాడు. కోచింగ్ అనుభవలేమి ఇక్కడ స్పష్టంగా తెలిసిపోతుంది. మెంటార్ వేరు. హెడ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించడం వేరు. అనుభవం లేనపుడు విజయాలు ఎలా సాధిస్తాం' అంటూ తన మనసులో మాట బయటపెట్టాడు.
ఇది కూడా చదవండి: Daaku Maharaj Review: 'డాకు మహారాజ్' ఫస్ట్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?
భారత కోచే ఉండాలా?
ఇక భారత జట్టుకు ఇండియా కోచే ఉండాలా? అని ప్రశ్నించాడు. విదేశీయులకు ఎమోషనల్ ఫీలింగ్స్ ఉండవని, వారి భావాలను మన ఆటగాళ్లు అర్థం చేసుకోలేరని, వారంతా కేవలం డబ్బుల కోసమే పని చేస్తారని గంభీర్ చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నాడు తివారి. ఇక 2014లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు ఆడుతున్న సమయంలో గంభీర్, మనోజ్ మధ్య వివాదాలు జరిగాయి. గంగూలీతో పాటు తన కుటుంబ సభ్యులను కూడా గంభీర్ దూషించాడని, అందుకే అతనితో గొడవ పడ్డట్లు మనోజ్ గుర్తు చేశాడు.
ఇది కూడా చదవండి: BIG BREAKING: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి చంద్రబాబు అదిరిపోయే శుభవార్త!