/rtv/media/media_files/2025/05/27/wQZR00Y1dgGP6HBMfFmg.jpg)
lsg vs rcb ipl 2025
LSG Vs RCB: ఐపీఎల్ 18వ సీజన్ చివరి దశకు చేరుకుంది. ఇందులో భాగంగానే ఇవాళ లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య 70వ మ్యాచ్ జరగనుంది. లక్నో వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఆర్సీబీ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో లక్నో జట్టు బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ ఆర్సీబీకి చాలా కీలకం. ఇందులో RCB గెలిస్తే 19 పాయింట్లతో టాప్-2లో నిలుస్తుంది. ఆపై తొలి క్వాలిఫయర్‌లో పంజాబ్ కింగ్స్ జట్టును ఢీ కొడుతుంది. ఒకవేళ లక్నో చేతిలో RCB ఓడితే ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీ, ముంబయి తలపడనున్నాయి.
Also Read: అనిరుధ్‌కు కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
తుది జట్లు ఇవే
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, మయాంక్ అగర్వాల్, రజత్ పాటిదార్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(w/c), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, నువాన్ తుషార.
లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): మిచెల్ మార్ష్, మాథ్యూ బ్రీట్జ్కే, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(w/c), ఆయుష్ బడోని, అబ్దుల్ సమద్, హిమ్మత్ సింగ్, షాబాజ్ అహ్మద్, దిగ్వేష్ సింగ్ రాఠీ, అవేష్ ఖాన్, విలియం ఓర్కే.
Also Read: అనిరుధ్‌కు కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
కోహ్లీ ముందు రెండు రికార్డులు
ఇదిలా ఉంటే విరాట్ కోహ్లీని మరో రెండు రికార్డులు ఊరిస్తున్నాయి. ఇంకో 24 పరుగులు చేస్తే టీ20ల్లో ఆర్సీబీ తరఫున 9వేల పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా నిలుస్తాడు. అలాగే మరో హాఫ్ సెంచరీ చేస్తే డేవిడ్ వార్నర్ (62) రికార్డు బద్దలు కొట్టి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక అర్ధశతకాలు చేసిన బ్యాటర్‌గా నిలవనున్నాడు.
ఇప్పటికే ఈ సీజన్‌లో ఆడిన 12 ఇన్నింగ్స్‌ల్లో 548 పరుగులు చేసిన కోహ్లీ ఆర్సీబీలోనూ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అయితే మరో 24 పరుగులు చేస్తే టీ20ల్లో ఆర్సీబీ తరఫున 9వేల రన్స్ చేసిన తొలి బ్యాటర్‌గా నిలుస్తాడు. ఐపీఎల్‌లో 256 ఇన్నింగ్స్‌లో 8,552 పరుగులు చేసిన కోహ్లీ, సీఎల్‌టీ20 (ఛాంపియన్ లీగ్ టీ20)లో 14 ఇన్నింగ్స్‌లో 424 రన్స్ చేశాడు. మొత్తంగా ఆర్సీబీ తరఫున 270 ఇన్నింగ్స్‌ల్లో 8,976 రన్స్ కొట్టాడు. ఇక మరో హాఫ్ సెంచరీ చేస్తే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక అర్ధశతకాలు చేసిన బ్యాటర్‌గా నిలుస్తాడు.
Also Read: వారెవ్వా అదిరిపోయింది.. iQOO నుంచి కిర్రాక్ స్మార్ట్‌ఫోన్ - ఫీచర్లు హైక్లాస్!
62 అర్ధశతకాలతో డేవిడ్ వార్నర్‌తో పేరిటవున్న రికార్డును బద్దలు కొడతాడు. అయితే ఈ సీజన్ లోనే ఈ రెండు రికార్డులు బద్ధలు కొడతాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇక 2025 సీజన్‌లో ఆర్సీబీ 17 పాయింట్లో 3వ స్థానంలో కొనసాగుతోంది. తదుపరి మ్యాచ్ లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో జరగనుండగా నెట్‌రన్ రేట్‌తో విజయం సాధిస్తే ఆర్సీబీ మొదటి ప్లేస్ లో నిలుస్తుంది.
Also Read: అనిరుధ్‌కు కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!