/rtv/media/media_files/2025/03/09/m8jBfzzeLbCaxnHorlw2.jpg)
R Aswin About Today's Match
లాస్ట్ 14 వన్డేల్లో భారత జట్టు 14సార్లు టాస్ ఓడిపోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ ఇందులో 11 సార్లు టాస్ గెలవలేదు. ఇందులో చాలావాటిల్లో టాస్ గెలవకపోయినా మ్యాచ్ గెలిచారు. అయితే లాస్ట్ ఇయర్ జరిగిన వన్డే వరల్డ్ కప్ లో భారత జట్టు టాస్ గెలవకపోవడం వలన భారీ మూల్యాన్నే చెల్లించుకోవాల్సి వచ్చింది. దాంతో ఇప్పుడు ఈరోజు జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ మ్యాచ్ లో ఎవరు టాస్ గెలుస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ ఎవరు గెలిచినా కప్పు కొట్టేది మాత్రం భారత జట్టే అంటున్నారు మాజీలు. తుది పోరులో టీమ్ ఇండియాను ఫేవరెట్ అని చెబుతున్నారు.
టాస్ గెలవాల్సిన అవసరం లేదు..
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో టీమ్ ఇండియా టాస్ గెలవాల్సిన అవసరం లేదంటున్నాడు మాజీ బౌలర్ అశ్విన్. నిజానికి నా అభిప్రాయం ప్రకారం టాస్ గెలవకుండా ఉంటేనే మంచిదని కూడా అంటున్నాడు. ఇంతకు ముందు వన్డేల్లో భారత్ ఇప్పటి వరకు ఈ ట్రోఫీలో టాస్ ఓడిపోయినప్పుడు లక్ష్య ఛేదనకు దిగినా.. తొలుత బ్యాటింగ్ చేసినా విజయం సాధించింది. ఈ సారి కూడా భారతజట్టే విజయం సాధిస్తుందని అశ్విన్ నమ్మకం చెబుతున్నాడు. తుది పోరులో గెలుపు శాతాలు 54 - 46గా ఉన్నాయని అన్నాడు. అయితే న్యూజిలాండ్ ను తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. వాళ్ళ బౌలర్లు ఇప్పుడు బలంగానే ఉన్నారు. ఇంతకు ముందు మ్యాచ్ లో కూడా టీమ్ ఇండియాను ఇబ్బంది పెట్టారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఆడాలని అశ్విన్ సూచించాడు.
Also Read: Syria: సిరియాలో 1000కు చేరిన మృతుల సంఖ్య