Syria: సిరియాలో 1000కు చేరిన మృతుల సంఖ్య

సిరియా హింసలో చనిపోయిన మృతుల సంఖ్య వెయ్యికి చేరింది. ఇక్కడ అంతర్యుద్ధం మొదలయ్యాక ఇదే అత్యంత ఘోరమైన ఘటనగా దీన్ని చెబుతున్నారు. బ్రిటన్‌కు చెందిన సిరియన్‌ అబ్జర్వేటరీ ఫర్‌ హ్యూమన్ రైట్స్ ఘర్షణకు సంబంధించి వివరాలను తెలిపింది. 

author-image
By Manogna alamuru
New Update
international

Syria clash

సిరియాలో బషర్ అసద్ పాలన అంతం అయిన మూడు నెలల వరకు అంతా బాగానే ఉంది. భద్రతా దళాల సంరక్షణలో అక్కడి ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. కానీ మూడు నెలల తర్వాత నుంచి ఘర్షణలు మొదలయ్యాయి. అసద్ మద్దతుదారులు తీవ్రంగా దాడులు చేస్తున్నారు. వీటిని తీవ్రంగా పరిగణించిన ప్రస్తుత ప్రభుత్వం వారిని సమర్ధవంతంగా ఎదుర్కోంటోంది. ఈ క్రమంలో ప్రభుత్వ అనుకూల ఫైటర్లు అసద్‌ విధేయులైన అలవైట్‌ వర్గంపై ప్రతీకార దాడులు మొదలుపెట్టడం తీవ్ర హింసకు దారితీసింది.  ఇరు వర్గాల దాడుల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు అక్కడి బనీయాస్ లో చోటు చేసుకున్న హింసలోనూ చాలా మంది చనిపోయారు. అక్కడి వీధులు, బిల్డింగ్ లు అన్నీ మృతదేహాలతో నిండిపోయి ఉన్నాయి. వాటిని తీసేందుకు కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. మృతదేహాలను ఖననం చేయనివ్వకుండా గన్ మెన్ లు అడ్డుకుంటున్నారని చెబుతున్నారు. 

వెయ్యికి చేరిన మృతుల సంఖ్య..

అసద్ మద్దతు దారులకు, భద్రతా దళాలకు మధ్య జరుగుతున్న దాడుల్లో ఇప్పటివరకు వెయ్యి మంది చనిపోయారు. ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చని చెబుతున్నారు. బ్రిటన్‌కు చెందిన సిరియన్‌ అబ్జర్వేటరీ ఫర్‌ హ్యూమన్ రైట్స్ ఘర్షణ ఈ దాడులకు సంబంధించి మొత్తం వివరాలను బహిర్గతం చేసింది. అసద్ మద్దతుదారులే మొదట భద్రతా దళాల మీద దాడులకు పాల్పడ్డారు. ఆ తరువాత రక్షణ దళాలు కూడా ప్రతి దాడులు చేశాయి. ఈ ఘర్షణలో చనిపోయిన వారిలో 745 మంది సాధారణ పౌరులు, 125 మంది భద్రతా బలగాలు, 148 మంది అసద్‌ మద్దతుదారులు ఉన్నారు. దాడులు చేయడమే కాకుండా లటికాయ వంటి నగరాల్లో అసద్ మద్దతుదారులు కరెంట్, తాగునీరు లాంటివి కూడా అడ్డుకుంటున్నారు. చాలాచోట్ల ఇళ్లకు నిప్పంటించడం లాంటివి కూడా చేశారు. 

మూడు నెలల క్రితమే సిరియాను తిరుగుబాటుదారులు సొంతం చేసుకున్నారు. పదమూడేళ్ల కిందట సిరియాలో అంతర్యుద్దం స్టార్ట్‌ అయ్యింది. అప్పటి నుంచి బసర్ అల్ అసద్ సారథ్యంలోని ప్రభుత్వం దళాలు, రెబల్స్ మధ్య యుద్ధం మొదలైంది. చివరికి రెబెల్స్ గెలిచి సిరియాను ఆక్రమించుకున్నారు. దీంతో ఆ దేశ అధ్యక్షుడు బషర్ అసద్ సిరియాను విలిపెట్టి పారిపోయారు. ఆయన ప్రస్తుతం రష్యాలో తలదాచుకున్నారు. దాని తరువాత ఒకే ఒక్కసారి ఆయన ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు. సిరియాను వదిలిపెట్టేదే లేదని చెప్పారు. ఇప్పుడు మూడు నెలల తర్వాత అసద్ మద్దతుదారులు భద్రతా దళాల మీద దాడులు చూస్తూ బీభత్సం సృష్టిస్తున్నారు. ఈ క్రమంలో అమాయక పౌరులను కూడా బలి తీసుకుంటున్నారు.  

Also Read: Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ కు భారీగా బెట్టింగ్..ఏకంగా 5వేల కోట్లు..

Advertisment
తాజా కథనాలు