/rtv/media/media_files/2025/06/03/OGrH5uN68A31H6qbiFX3.jpg)
Virat Kohli, RCB
బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ అంటే విరాట్...కోహ్లీ అంటూ ఆర్సీబీ అన్నట్టుగా మారిపోయింది ఇప్పుడు. దీనికి కారణం చాలా కాలం తర్వాత ఆర్సీబీ ఫైనల్ కు రావడమే. ఐపీఎల్ లో ఇప్పటి వరకు ఆర్సీబీ టైటిల్ విన్నర్ గా నిలవలేదు. మూడు సార్లు ఫైనల్ కు వెళ్ళిన్నా కప్ గెలవలేకపోయింది. దీంతో ఐపీఎల్ మొదలైన దగ్గర నుంచీ ఆడుతున్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఇది కలగానే మిగిలిపోయింది. కోహ్లీ చాలసార్లు మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డ్స్ దక్కించుకున్నాడు. కానీ జట్టును మాత్రం ఛాంపియన్ చేయలేకపోయాడు.
RCB into the finals One step away from glory make it happen god 🤞🏻❤️ for this man @imVkohli #ipl2025playoffs #iplfinal2025 #ViratKohli pic.twitter.com/UPA8qbBQYe
— Idol_Virat_edits (@Iam_viratian_18) May 29, 2025
ఆర్సీబీకి బంగారం లాంటి అవకాశం..
ఇప్పుడు బెంగళూరు జట్టు మరోసారి ఫైనల్స్ కు చేరుకుంది. ఇది ఆ జట్టుకు బంగారం లాంటి అవకాశం. ఇప్పుడు ఫైనల్స్ లో విన్ అవలేకపోతే ఫ్యూచర్ లో మరింత కష్టం అవుతుంది అనేది నిపుణులు, అభిమానుల మాట. అందులోనూ విరాట్ కోహ్లీకి ఇది చాలా ముఖ్యమైన సీజన్. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు వరుసగా తమ కెరీర్ కు సంబంధించి డెసిషన్స్ తీసుకుంటున్నారు. టీ20, టెస్ట్ లకు రిటైర్మెంట్ ప్రకటించారు ఐపీఎల్ కూడా ఎన్నాళ్ళు ఆడతారో చెప్పలేము. ఇంకో రెండేళ్లు, మూడేళ్లు విరాట్ ఐపీఎల్ ఆడతాడు అనుకున్నా...అప్పుడు బెంగళూరు జట్టు ఫైనల్స్ కు వస్తుందా రాదా అని చెప్పలేము. ఎందుకంటే ప్రతీ ఏడాది ఐపీఎల్ లో డైనమిక్ ఛేంజ్ వస్తూనే ఉంది. ఎప్పుడు ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టం అవుతోంది. దాంతో పాటూ ఫ్యూచర్ లో మరింత మంది యంగ ప్లేయర్లు వస్తారు. వారితో సమానంగా సీనియర్లు ఆగలరో లేదో కడా తెలీదు.అలాంటప్పుడు ఫ్రాంచైజీలు సీనియర్లను పక్కన పెట్టేయొచ్చు. ఈ అన్ని కారణాల వలన విరాట్ కోహ్లీ కి ఇది చాలా ముఖ్యమైన సీజన్. దీంతో ఇప్పుడు అతని మీద కూడా చాలా ప్రెజర్ ఏర్పడింది. ఐనల్ మ్యాచ్ లో బాగా ఆడి కప్ గెలవాల్సిన బాధ్యత అతని మీద ఉంది. బెంగళూరు జట్టు కూడా ఇదే భావిస్తోంది. అందుకే ఈసారి ఎలా అయినా గెలిచి కోహ్లీకి కప్ ను అందించాలని భావిస్తోంది. ఇక బెంగళూరు అభిమానులు సంగతి అయితే చెప్పనే అక్కర్లేదు. ఈ సాలా కప్ నమ్దే అంటూ వెర్రెక్కిపోతున్నారు.
The day has come finally 😭
— imharsh (@Harsh_SimplyMe) June 3, 2025
This time God has to be kind to Virat.... He Deserves that trophy more than anyone else, Just want to see VK lifting that trophy on podium 🥹❤️
Please GOD 🙏🛐🧿#ViratKohli #RCBvPBKS #IPLFinalpic.twitter.com/29lPKoP9ph
Also Read: Stock Markets: నష్టాల్లో ఊగిసలాడుతున్న దేశీ మార్కెట్లు