IPL-2026 ప్రారంభ తేదీలో మార్పు.. ఎప్పటినుంచంటే

ఐపీఎల్‌ 19వ సీజన్‌ ప్రారంభ తేది మారింది. గతేడాది ఈ టోర్నీని మార్చి 26న ప్రారంభించగా.. ఈ ఏడాది మార్చి 28కి వాయిదా పడింది. ఈ విషయాన్ని నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు.

New Update
IPL 2026 to begin on March 28

IPL 2026 to begin on March 28

ఐపీఎల్‌ 19వ సీజన్‌ ప్రారంభ తేది మారింది. గతేడాది ఈ టోర్నీని మార్చి 26న ప్రారంభించగా.. ఈ ఏడాది మార్చి 28కి వాయిదా పడింది. ఈ విషయాన్ని నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. కొత్త సీజన్‌కు ముందు ఆటగాళ్లకు, ఫ్రాంచైజీలకు కొంచెం సమయం ఇచ్చేందుకు IPL  గవర్నింగ్ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ ఇంకా విడుదల కావాల్సి ఉంది.  

Also Read: దద్దరిల్లిపోయిన మోదీ స్టేడియం.. ఫైనల్ మ్యాచ్‌లో సరికొత్త రికార్డు

ఈ సీజన్‌లో మొదటి మ్యాచ్‌ బెంగళూరులోని చిన్నస్వామి స్డేడియంలో జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ స్టేడియంలో అయిదు మ్యాచులు నిర్వహించేందుకు BCCI పర్మిషన్ ఇచ్చింది. ఇక మిగిలిన రెండు హోం మ్యాచులను రాయిపూర్‌లోని వీర్‌ నారాయణ్ సింగ్ ఇంటర్నేషల్‌ స్టేడియంలో RCB ఆడనుంది. మే 31న గ్రాండ్‌ ఫైనల్‌తో ఐపీఎల్ 2026 సీజన్ ముగియనుంది. 

Also Read: ధోనీ తర్వాత సంజూనే.. వికెట్ కీపర్‌గా అరుదైన రికార్డు!

ఐపీఎల్‌ పూర్తి షెడ్యూల్‌ను రిలీజ్‌ చేయడంలో కాస్త ఆలస్యం జరుగుతోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాల్సి ఉంది. అందుకే మ్యాచ్‌ తేదీలను ఖరారు చేయడంలో నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 

Advertisment
తాజా కథనాలు