IND vs NZ : దద్దరిల్లిపోయిన మోదీ స్టేడియం.. ఫైనల్ మ్యాచ్‌లో సరికొత్త రికార్డు

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం భారత బ్యాటర్ల బాదుడుకు దద్దరిల్లిపోయింది. ఆదివారం న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో భారత టాప్ ఆర్డర్ బ్యాటర్లు ముగ్గురూ హాఫ్ సెంచరీలు బాది సరికొత్త రికార్డు సృష్టించారు.

New Update
ind 50

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం భారత బ్యాటర్ల బాదుడుకు దద్దరిల్లిపోయింది. ఆదివారం న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో భారత టాప్ ఆర్డర్ బ్యాటర్లు ముగ్గురూ హాఫ్ సెంచరీలు బాది సరికొత్త రికార్డు సృష్టించారు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో మొదటి ముగ్గురు బ్యాటర్లు 50 కంటే ఎక్కువ పరుగులు చేయడం ఇదే తొలిసారి.

గత కొన్ని మ్యాచ్‌లుగా సైలెంట్‌గా ఉన్న ఓపెనర్ అభిషేక్ శర్మ, ఫైనల్‌లో మాత్రం వైలెంట్‌గా మారాడు. కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది అందరినీ ఆశ్చర్యపరిచాడు. మొత్తం మీద 21 బంతుల్లో 52 పరుగులు చేసి, టీమ్ స్కోరు 98 వద్ద పెవిలియన్ చేరాడు.

మరోవైపు ఓపెనర్ సంజూ శాంసన్ ఈ టోర్నీలో తన సూపర్ ఫామ్‌ను కొనసాగించాడు. 33 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసిన సంజూ, ఆ తర్వాత కివీస్ బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు. కేవలం 46 బంతుల్లో 89 పరుగులు (15.1 ఓవర్ల వద్ద అవుట్) చేసి టీమ్ స్కోరును 200 దాటించడంలో కీలక పాత్ర పోషించాడు.

సంజూకు తోడైన ఇషాన్ కిషన్ కూడా ఏమాత్రం తగ్గలేదు. కేవలం 23 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. కిషన్ 25 బంతుల్లో 54 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక భారత్ ఇన్నింగ్స్ ముగిసే సమయానికి 255 పరుగులు చేసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఇదే అత్యధిక టీ20 స్కోరు కావడం విశేషం

Advertisment
తాజా కథనాలు