Sanju Samson : ధోనీ తర్వాత సంజూనే.. వికెట్ కీపర్‌గా అరుదైన రికార్డు!

టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో టీమ్ ఇండియా ఓపెనర్ సంజూ శాంసన్ అదరగొడుతున్నాడు. ఆదివారం న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో తొలి ఓవర్‌లోనే మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాది తన పరుగుల ఖాతా తెరిచాడు.

New Update
samson

టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో టీమ్ ఇండియా ఓపెనర్ సంజూ శాంసన్ అదరగొడుతున్నాడు. ఆదివారం న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో తొలి ఓవర్‌లోనే మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాది తన పరుగుల ఖాతా తెరిచాడు. ఈ సిక్సర్‌తోనే సంజూ టీ20 ఇంటర్నేషనల్స్‌లో వికెట్ కీపర్-బ్యాటర్‌గా 1000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.  భారత్ తరపున వికెట్ కీపర్‌గా టీ20ల్లో 1000 పరుగులు పూర్తి చేసిన రెండో ఆటగాడిగా సంజూ చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు లెజెండరీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (1617 పరుగులు) మాత్రమే ఈ ఘనత సాధించాడు. ధోనీ 85 ఇన్నింగ్స్‌ల్లో ఈ మార్కును దాటగా, సంజూ కేవలం తన 45వ మ్యాచ్‌లోనే (కీపర్‌గా) ఈ రికార్డును అందుకోవడం విశేషం.

టాప్ వికెట్ కీపర్ల జాబితా (భారత్):

ఎంఎస్ ధోనీ: 1617 పరుగులు

సంజూ శాంసన్: 1000+ పరుగులు

రిషబ్ పంత్: 996 పరుగులు (వెయ్యికి అడుగు దూరంలో)

ఇషాన్ కిషన్: 545 పరుగులు

సిక్సర్ల వేటలో వరల్డ్ రికార్డుకు చేరువలో..

ఈ మ్యాచ్‌లో సంజూ కొట్టిన ఆ సిక్సర్ ఈ టోర్నీలో అతనికి 17వది. ఇప్పటివరకు ఒకే వరల్డ్ కప్ ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు న్యూజిలాండ్ ప్లేయర్ ఫిన్ అలెన్ (20 సిక్సర్లు) పేరిట ఉంది. సంజూ మరో నాలుగు సిక్సర్లు కొడితే ఆ రికార్డును కూడా బ్రేక్ చేస్తాడు. ప్రస్తుతం సంజూ ఉన్న ఫామ్ చూస్తుంటే, సిక్సర్ల రికార్డుతో పాటు టీమ్ ఇండియాకు వరల్డ్ కప్ అందించడం ఖాయంగా కనిపిస్తోంది.

Advertisment
తాజా కథనాలు