IPL 2025 Retention: ఐపీఎల్ 2025 అత్యంత ఖరీదైన ఆటగాళ్లు వీళ్లే! ఐపీఎల్ 2025 రిటెన్షన్ లిస్ట్ విడుదల కాగా.. ఇందులో రూ.23 కోట్లతో అత్యంత ఖరీదైన ఆటగాడుగా హెన్రిచ్ క్లాసెన్ ఉన్నాడు. ఇతన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత స్థానంలో విరాట్ కోహ్లీ, నికోలస్ పూరన్ రూ .21 కోట్లతో ఉన్నారు. By Kusuma 01 Nov 2024 in స్పోర్ట్స్ Latest News In Telugu New Update షేర్ చేయండి IPL 2025 Retention: ఐపీఎల్ 2025 సీజన్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతోగానో ఎదురుచూస్తున్నారు. నవంబర్ రెండు లేదా మూడో వారంలో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ రిటెన్షన్ లిస్ట్‌ను నిన్న విడుదల చేశారు. అందరి కంటే ఎక్కువగా పంజాబ్ కింగ్స్ రూ. 110.5 కోట్లతో మెగా వేలానికి సిద్ధమవుతోంది. అయితే ఈ రిటెన్షన్‌లకు ముందు దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్‌నను రూ.23 కోట్లు వెచ్చించి సన్ రైజర్స్ హైదరాబాద్ సంపాదించుకుంది. ఈ రిటెన్షన్‌లో హెన్రిచ్ క్లాసెన్ అత్యంత ఖరీదైన ఆటగాడు. The wait is over and the retentions are 𝙃𝙀𝙍𝙀! 🔥Here are all the players retained by the 🔟 teams ahead of the #TATAIPL Auction 💪What do you make of the retention choices 🤔 pic.twitter.com/VCd0REe5Ea — IndianPremierLeague (@IPL) October 31, 2024 ఇది కూడా చదవండి: జగన్ కు బిగ్ షాక్.. మీటింగ్ మధ్యలోనే అలిగి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే అత్యంత ఖరీదైన భారత ఆటగాడు.. కింగ్ విరాట్ కోహ్లీని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.21 కోట్లతో సొంతం చేసుకుంది. రిటెన్షన్‌కు ముందు అత్యంత ఖరీదైన ఆటగాడు విరాట్ కోహ్లీనే. ఐపీఎల్ 2025 రిటెన్షన్‌కి ముందు వీరిద్దరే అత్యంత ఖరీదైన ఆటగాళ్లు. హెన్రిచ్ క్లాసెన్ రూ.23 కోట్లతో టాప్‌లో ఉండగా.. విరాట్ కోహ్లీ రూ. 21 కోట్లు , నికోలస్ పూరన్ రూ.21 కోట్లతో తర్వాత స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, పాట్ కమిన్స్, రషీద్ ఖాన్ రూ.18 కోట్లు, అక్సర్ పటేల్, శుభమన్ గిల్ రూ 16.5 కోట్లతో ఖరీదైన ఆటగాళ్లగా నిలిచారు. pic.twitter.com/kJUJ84WG9F — IndianPremierLeague (@IPL) October 31, 2024 ఇది కూడా చదవండి: TG Train: తెలంగాణ రైలు ప్రయాణికులకు శుభవార్త.. మరో రెండు కొత్త లైన్లు! pic.twitter.com/TNMzgQlLJq — IndianPremierLeague (@IPL) October 31, 2024 కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) - రూ. 51 కోట్లురిటెన్షన్స్: సునీల్ నరైన్ (12), రింకూ సింగ్ (13), ఆండ్రీ రస్సెల్ (12), వరుణ్ చకరవర్తి (12), హర్షిత్ రాణా (4), రమణదీప్ సింగ్ (4). సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్ ) - 45 కోట్లురిటెన్షన్స్: హెన్రిచ్ క్లాసెన్ (23), పాట్ కమిన్స్ (18), ట్రావిస్ హెడ్ (14), అభిషేక్ శర్మ (14), నితీష్ కుమార్ రెడ్డి (6). రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) - రూ. 41 కోట్లురిటెన్షన్స్: సంజు శాంసన్ (18), రియాన్ పరాగ్ (14), యశస్వి జైస్వాల్ (18), సందీప్ శర్మ (4), ధ్రువ్ జురెల్ (14), షిమ్రోన్ హెట్మెయర్ (11). రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) - రూ. 83 కోట్లురిటెన్షన్స్: విరాట్ కోహ్లీ (21), రజత్ పటీదార్ (11), యశ్ దయాల్ (5). చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) - రూ. 55 కోట్లురిటెన్షన్లు: రుతురాజ్ గైక్వాడ్ (18), ఎంఎస్ ధోని (4), రవీంద్ర జడేజా (18), శివమ్ దూబే (12), మతీషా పతిరానా (13). ఇది కూడా చదవండి: అమెరికా ఎన్నికలకు ముందే అణుబాంబు దాడి.. ఇరాన్ బిగ్ ప్లాన్! లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జి) - రూ.69 కోట్లురిటెన్షన్స్: నికోలస్ పూరన్ (21), మయాంక్ యాదవ్ (11), రవి బిష్ణోయ్ (4), మొహ్సిన్ ఖాన్ (4), ఆయుష్ బదోని (4). గుజరాత్ టైటాన్స్ (జీటీ) - రూ.69 కోట్లురిటెన్షన్స్: రషీద్ ఖాన్ (18), శుభమన్ గిల్ (16.5), సాయి సుదర్శన్ (8.5), రాహుల్ తెవాటియా (4), షారుక్ ఖాన్ (4). ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) - రూ. 73 కోట్లురిటెన్షన్స్: అక్షర్ పటేల్ (16.5), అభిషేక్ పోరెల్ (4), ట్రిస్టన్ స్టబ్స్ (10), కుల్దీప్ యాదవ్ (13.5) పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) - రూ. 110.5 కోట్లురిటెన్షన్స్: శశాంక్ సింగ్ (5.5), ప్రభసిమ్రాన్ సింగ్ (4). ముంబై ఇండియన్స్ (ఎంఐ) - రూ. 45 కోట్లురిటెన్షన్స్: రోహిత్ శర్మ (16.3), జస్ప్రీత్ బుమ్రా (18), సూర్యకుమార్ యాదవ్ (16.35), తిలక్ వర్మ (8), హార్దిక్ పాండ్యా (16.35). ఇది కూడా చదవండి: ప్రెసిడెంట్ అయ్యేనాటికి యుద్ధం ముగియాలి–ఇజ్రాయెల్‌కు చెప్పిన ట్రంప్ #telugu-news #breaking-news #ipl #ipl-2025 #cricket-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి