TG Train: తెలంగాణ రైలు ప్రయాణికులకు శుభవార్త.. మరో రెండు కొత్త లైన్లు! తెలంగాణ రైలు ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే మరో శుభవార్త అందించనుంది. రాష్ట్రవ్యాప్తంగా రెల్వే కనెక్టివిటీ మరింత పెంచనున్నట్లు తెలిపింది. 2025 కేంద్ర బడ్జెట్‌లో మరో 2 లైన్లు మంజూరు చేయనున్నట్లు వెల్లడించింది. By srinivas 31 Oct 2024 | నవీకరించబడింది పై 31 Oct 2024 19:16 IST in తెలంగాణ వరంగల్ New Update షేర్ చేయండి తెలంగాణ రైలు ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే మరో శుభవార్త అందించనుంది. రాష్ట్రవ్యాప్తంగా రెల్వే కనెక్టివిటీ మరింత పెంచనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్రయాణికులకు ఉపయోగపడే మూడు ప్రతిపాదిత రైల్వే ప్రాజెక్టులు కీలకదశలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. పుణే, ముంబై వెళ్లే సికింద్రాబాద్-వాడి మార్గం ప్రస్తుతం రెండు లైన్లతో ఉండగా.. దాన్ని విస్తరించబోతున్నట్లు తెలిపారు. క్వాడ్రాప్లింగ్ (నాలుగు లైన్ల)కు విస్తరించేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే సిద్ధమవుతుండగా.. ఈ లైన్ ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్ ఇప్పటికే రైల్వే బోర్డుకు అందించన విషయం తెలిసిందే. కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్‌లో.. ఇక బోర్డు అనుమతి రాగానే 2025 ఫిబ్రవరి 1న కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టు మంజూరు అవుతుందని రైల్వేశాఖ అధికారులు చెబుతున్నారు. దీంతోపాటే తెలంగాణలో మరో 2 లైన్ల మంజూరుకు అవకాశం ఉందంటున్నారు. కరీంనగర్ - హసన్‌పర్తితో పాటు డోర్నకల్-మిర్యాలగూడ కొత్త రైల్వే లైన్లకు సంబంధించిన డీపీఆర్‌లు సిద్ధమయ్యాయి. ఇవి కొంతకాలం క్రితమే రైల్వే బోర్డుకు చేరాయి. ఈ మూడు రైల్వే ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.7,840.37 కోట్లు. ప్రాజెక్టులకు సంబంధించిన అలైన్‌మెంట్, దూరం, అంచనా వ్యయం వివరాలను డీపీఆర్‌లో ఇప్పటికే నిర్ణయించారు. తెలంగాణ ప్రభుత్వం, ఎంపీలు ప్రత్యేక దృష్టి సారిస్తే ఈ మూడు రైల్వే ప్రాజెక్టులు వచ్చే బడ్జెట్‌లోనే మంజూరయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: జగన్ కు బిగ్ షాక్.. మీటింగ్ మధ్యలోనే అలిగి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి పుణేకు శతాబ్ది ఎక్స్‌ప్రెస్, ముంబైకి వెళ్లే హుస్సేన్‌సాగర్ ఎక్స్‌ప్రెస్ సహా పలు ట్రైన్లు వికారాబాద్, వాడి మార్గంలో నడుస్తున్నాయి. ప్రస్తుతం వాడి వరకు రెండు లైన్ల ట్రైన్ మార్గం మాత్రమే ఉండగా.. ట్రైన్ల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ మార్గాన్ని నాలుగు లైన్లుగా విస్తరించేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రైమరీ సర్వే, ఫైనల్ లొకేషన్ సర్వేలు పూర్తయినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. డోర్నకల్-మిర్యాలగూడ కొత్త ట్రైన్ మార్గంతో హైదరాబాద్, విజయవాడ, చెన్నై, ఢిల్లీ రైలు మార్గాలు కనెక్ట్ చేయనున్నారు. ప్రతిపాదిత ట్రైన్ మార్గం సరకు రవాణాకు అత్యంత కీలకం అవుతుందని రైల్వేశాఖ భావిస్తోంది. మిర్యాలగూడ సమీపంలోని దామరచర్లలో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌కు సింగరేణి నుంచి బొగ్గు సరఫరా చేయాల్సి ఉండగా ఈ మార్గం ఉపయోగపడనుంది. ఇది కూడా చదవండి: IT:TCS ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. ఇక 15 ఏళ్ల పాటు నో టెన్షన్! హుజూరాబాద్ మీదుగా కరీంనగర్.. ఇదిలా ఉంటే.. హసన్‌పర్తి నుంచి హుజూరాబాద్ మీదుగా కరీంనగర్ కు కొత్త మార్గం నిర్మించాలనే డిమాండ్ ఉంది. ప్రస్తుతం తెలంగాణ, సౌత్ స్టేట్స్ నుంచి మహారాష్ట్ర, గుజరాత్‌కు కాజీపేట, రామగుండం, బల్లార్ష, వార్దా మీదుగా ట్రైన్ల రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి. హసన్‌పర్తి- కరీంనగర్ ట్రైన్ మార్గం మంజూరైతే హనస్‌పర్తి నుంచి హుజూరాబాద్, కరీంనగర్‌కు. అక్కడినుంచి ప్రస్తుతం ఉన్న కరీంనగర్-జగిత్యాల-నిజామాబాద్-బాసర-నాందేడ్-ఔరంగాబాద్ ట్రైన్ మార్గంలో రైళ్ల రాకపోకలు సాగించవచ్చునని అధికారులు భావిస్తున్నారు. #telangana #train #south-central-railway మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి