జగన్ కు బిగ్ షాక్.. మీటింగ్ మధ్యలోనే అలిగి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే జగన్ కు సొంత జిల్లాలో బిగ్ షాక్ తగిలింది. జమ్మలమడుగు నియోజకవర్గ ఇంచార్జి వ్యవహారం కొలిక్కి రాలేదు. సుధీర్ రెడ్డి సమావేశం నుంచి మధ్యలోనే అలిగి వెళ్లి పోగా.. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి జగన్ నిర్ణయానికి వదిలేశారు. By srinivas 31 Oct 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి YS Jagan: ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే కీలకనేతలంతా పార్టీని వీడి వెళ్తుండగా మరోవైపు కుటుంబ కలహాలతో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న జగన్ కు సొంత జిల్లా నేత షాక్ ఇచ్చాడు. మూడు రోజులపాటు కడప ఇడుపుల పాయలో పర్యటించిన జగన్.. జమ్మలమడుగు నియోజకవర్గ ఇంచార్జి వ్యవహారంపై చర్చలు జరిపినా కొలిక్కి రాకపోవడం చర్చనీయాంశమైంది. మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిలకు చెరో మూడు మండలాల ప్రతిపాదనను జగన్ ప్రస్తావించగా వారు తిరస్కరించారు. సుధీర్ రెడ్డి సమావేశం నుంచి మధ్యలోనే అలిగి వెళ్లి పోగా.. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి జగన్ నిర్ణయానికి వదిలేశారు. ఇది కూడా చదవండి: VIRAT: కోహ్లీకి కెప్టెన్ బాధ్యతలు.. గెలుపే లక్ష్యంగా కోచ్ కీలక నిర్ణయం రామసుబ్బారెడ్డికే జగన్ మొగ్గు.. ఈ క్రమంలోనే ఇడుపులపాయ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బెంగళూరు యాలహంకకు పయనమైన జగన్.. వీరిద్దమరి మధ్య సయోధ్య కుదిర్చే బాధ్యతలు ఎంపీ అవినాష్ కు అప్పగించారు. అయితే మరో రెండు రోజుల్లో ఈ వ్యవహారం కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుండగా.. నియోజకవర్గ ఇంచార్జి రామసుబ్బారెడ్డి అయితేనే పార్టీ మరింత బలపడే అవకాశం ఉందని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. నిన్న ఎంపీ అవినాష్ రెడ్డి, చిన్నానలు దుగ్గాయపల్లి మల్లికార్జున రెడ్డి, మనోహర్ రెడ్డి, మేనమామ రవీంద్రనాథ్ రెడ్డితో కుటుంబ పెద్ద ప్రకాష్ రెడ్డితో జగన్ ఏకాంతంగా చర్చలు జరిపారు. ప్రకాష్ రెడ్డి ఇంటికి ఒక్కడే వెళ్ల ఆస్తుల వివాదంపై సుధీర్ఘ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: Ben Stokes: ఇంగ్లండ్ కెప్టెన్ ఇంట్లో దోపిడీ.. మెడల్ ఇవ్వాలంటూ రిక్వెస్ట్ పోస్ట్! #ys-jagan #kadapa మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి