BCCI: ఇంగ్లాండ్‌ పర్యటనకు ముందు భారత జట్టులో భారీ మార్పులు.. ఆ ఇద్దరు ఔట్!

ఇంగ్లాండ్ పర్యటనకు ముందు బీసీసీ జట్టులో భారీ మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. జంబో సపోర్ట్‌ స్టాఫ్‌ను ఇంగ్లాండు పంపించేందుకు ఆసక్తి చూపించట్లేదట. హెడ్ కోచ్ గంభీర్ ఆధ్వర్యంలో మార్చి 29న నిర్వహించే సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. 

New Update
bcci rohit sharma

India tour of England

BCCI:  భారత క్రికెట్ జట్టులో భారీ మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌ టోర్నీ అనంతరం టీమ్ ఇండియా  ఐదు టెస్టుల సిరీస్‌ ఆడేందుకు ఇంగ్లాండ్ వెళ్లనుంది. అయితే ఈ  పర్యటనకు ముందు సహాయక స్టాఫ్‌లో బీసీసీఐ భారీ మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. జంబో సపోర్ట్‌ స్టాఫ్‌ను ఇంగ్లాండు పంపించేందుకు బీసీసీఐ ఆసక్తి చూపించట్లేదట. 

 ఇద్దరు అసిస్టెంట్ కోచ్‌లు ఔట్..

ఈ మేరకు బీసీసీఐ సెక్రెటరీ దేవజిత్ సైకియా, చీఫ్‌ సెలక్టర్ అజిత్ అగార్కర్, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌ మార్చి 29న గువాహటిలో సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకోనున్నారట. అయితే రాహుల్ ద్రవిడ్‌ తర్వాత  కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన గంభీర్.. తనకు సహాయంగా  ఇద్దరు అసిస్టెంట్ కోచ్‌లు, బౌలింగ్‌ కోచ్‌ను తీసుకున్నాడు.  రైన్ టెన్ డస్కతే, అభిషేక్ నాయర్‌లు అసిస్టెంట్ కోచ్‌లుగా ఉన్నారు. మోర్నీ మోర్కెల్‌ను బౌలింగ్‌ కోచ్‌గా నియమించుకున్నారు. ఫీల్డింగ్‌ కోచ్‌గా దిలీప్‌ను కొనసాగిస్తున్నారు. బ్యాటింగ్‌ కోచ్‌గా సితాన్షు కోటక్‌ ఉన్నారు. అయితే వీరంతా ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్ ను విజేతగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించారు.

Also Read: హిందీపై యోగి, స్టాలిన్ మధ్య మాటల యుద్ధం.. బ్లాక్‌ కామెడీ అంటూ! 

అయితే ఇంగ్లాండ్‌ పర్యటనకు ప్రత్యేకంగా అసిస్టెంట్‌ కోచ్, ఫీల్డింగ్‌ కోచ్‌ అవసరం లేదని బీసీసీఐ భావిస్తోందట. అభిషేక్ నాయర్, దిలీప్‌ను పక్కన పెట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం.  సితాన్షు, మోర్నీ మోర్కెల్ ను కొనసాగించనున్నారట. ఇదంతా కూడా గౌతమ్ గంభీర్‌ నిర్ణయంపై ఆధారపడి ఉందని, బీసీసీఐ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. 

Also Read: ఈసారి చార్‌ధామ్ యాత్రలో వీరికి నో ఎంట్రీ.. అలా చేస్తే వెనక్కి పంపిస్తామంటున్న అధికారులు

england | india | today telugu news | rtv telugu news 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు