/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-11T121118.675-jpg.webp)
Indian Cricketer Mohammad Shami
M Shami: ఏడాది విరామం తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న భారత స్టార్ బౌలర్ షమీ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశాడు. ఇంగ్లాండ్ తో జరిగే టీ20 వన్డే సిరీస్ లకు జట్టులో స్థానం దక్కించుకున్న షమీ.. మోకాలికి శస్త్రచికిత్స కారణంగా 14 నెలలపాటు ఆటకు దూరమైన ఓ క్రికెటర్ మళ్లీ జట్టులోకి రావడం అంత సులభమైన విషయం కాదన్నాడు. దీని వెనక ఎంతో కృష్టి, పట్టుదలతోపాటు మానసిక బలం కూడా ఉంటుందని చెప్పాడు.
నేను ఇప్పుడు ఆ దశను దాటేశాను..
ఈ మేరకు గాలి పటం ఎగరవేస్తున్న వీడియోను షేర్ చేసిన షమీ.. బౌలింగ్ లేదా కారు డ్రైవింగ్ చేయాలంటే మెంటల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉండలన్నాడు. 'ఎవరైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. అప్పుడే దేనికి వెనకడుగు వేయం. నేను 15 ఏళ్ల తర్వాత గాలిపటం చక్కగా ఎగరవేయగలుగుతున్నా. వికెట్లు తీస్తూ, భారీ రన్స్ కొడుతున్నపుడు ప్రతి ఒక్కరూ మనతోనే ఉంటారు. కానీ క్లిష్ట సమయాల్లో ఎవరు ఉంటారనేది ముఖ్యం. ఏడాదిపాటు నేను దీనికోసం వేయిట్ చేశాను. చాలా కష్టపడి నిలబడి, పరిగెత్తుతున్నాను. మంచి ఫామ్‌లో ఉన్నప్పుడే గాయం కావడం కష్టంగా అనిపించింది. గాయాలైనపుడే స్ట్రాంగ్‌గా మారాలి. మానసికంగా దృఢంగా ఉంటే ఏదైనా సాధించగలం. నేను ఇప్పుడు ఆ దశను దాటేశాను. హర్డ్ వర్క్ సూత్రమే నా బలం' అంటూ చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Adilabad Tiger News: ఆదిలాబాద్‌లో పెద్ద పులి కలకలం.. భయాందళనలో ప్రజలు
ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ క్రికెట్‌లో మరో 2 వికెట్లు పడగొడితే షమీ 450 వికెట్ల క్లబ్‌లో చేరతాడు. 3 ఫార్మాట్లలో కలిపి 448 వికెట్లు తీసిన షమీ.. ఈ ఘనత సాధిస్తే అత్యధిక వికెట్లు తీసిన భారత నాలుగో పేస్ బౌలర్‌గా నిలుస్తాడు. అనిల్ కుంబ్లే 953, కపిల్ దేవ్ 687, జహీర్ ఖాన్ 597, జవగళ్ శ్రీనాథ్ 551 ముందున్నారు.