/rtv/media/media_files/2025/01/28/4Uvm18D6P9AwFqpatEWj.jpg)
Ambati Rayudu Photograph: (Ambati Rayudu)
విశాఖపట్నంలో ఇటీవల అఖిల భారత విద్యార్థి పరిషత్ మహాసభలు జరిగాయి. టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఈ సభకు అతిథిగా పాల్గొన్నారు. ఈ సభలో బీజేపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం చేశారు. దేశంలో ఉండే కొన్ని పార్టీల కుటుంబాల చుట్టూ తిరుగుతాయని, మరికొన్ని కార్పొరేట్ సంస్థల తిరుగుతాయి. కానీ దేశం కోసం పని చేసే పార్టీ బీజేపీ ఒక్కటేనంటూ సంచలన కామెంట్స్ చేయడంతో.. అంబటి రాయుడు త్వరలో పార్టీలో చేరబోతున్నారని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
ఇది కూడా చూడండి: occult worship : కర్నూలు జిల్లా బి తాండ్రపాడు ఎస్సార్ విద్యాసంస్థల్లో క్షుద్ర పూజల కలకలం
అంబటి రాయుడు బీజేపీకి సపోర్ట్‌గా సంచలన కామెంట్స్ చేశారు. విశాఖలో జరిగిన ఏబీవీపీ సభకి అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశం కోసం పని చేసే పార్టీ బీజేపీ ఒక్కటేనంటూ సపోర్ట్ చేశారు.
— RTV (@RTVnewsnetwork) January 28, 2025
Read More:https://t.co/zq7mcU0zqV#indiancricketer #ambatirayudu #RTV
ఇది కూడా చూడండి: Nandyala : నంద్యాలలో పేలిన సిలిండర్ ఇద్దరు మృతి, ఎనిమిది మందికి తీవ్ర గాయాలు
రాజకీయాలకు కొన్ని రోజులు దూరంగా ఉంటానని..
2019లో వైసీపీలో చేరిన అంబటి రాయుడు ఎన్నికలకు ముందు పార్టీకి రాజీనామా చేసి అందరికి బిగ్ షాక్ ఇచ్చాడు. కొన్ని రోజుల పాటు రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించాడు. తన వృత్తినే మళ్లీ కొనసాగిస్తానని అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు అంబటి రాయుడు తెలిపాడు. ప్రొఫెషనల్ క్రికెట్ ఆడాలంటే.. కొన్ని రోజులు రాజకీయాలకు దూరంగా ఉంటానని అన్నాడు. కానీ తాజాగా బీజేపీకి సపోర్ట్‌గా మాట్లాడటంతో మళ్లీ రాజకీయాల్లోకి వస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది.
ఇది కూడా చూడండి: America: కాళ్లూ, చేతులు కట్టేసి.. నీళ్లు కూడా ఇవ్వకుండా.. అక్రమవలసదారుపై అమెరికా వికృత చేష్టలు!
ఇది కూడా చూడండి: Vitamin D Injection: ఏడాదికి ఒకసారి విటమిన్ డి ఇంజెక్షన్‌తో లాభాలు