Women's World Cup: భారత్‌లోనే మహిళల వరల్డ్‌కప్ ఫైనల్..నాలుగో స్థానం కోసం టీమ్ ఇండియా ప్రయత్నం

ఇండియా, పాకిస్తాన్ వేదికగా మహిళల వరల్డ్ వన్డే కప్ జరుగుతోంది. ఇందులో లీగ్ దశ ముగుస్తోంది. తాజాగా వన్డే వరల్డ్ కప్ ఫైనల్ భారత్‌లోనే జరగనుంది. నవీ ముంబయ్‌లో ఈ మ్యాచ్ జరుగుతుంది. 

New Update
world cup

మహిళల వన్డే ప్రపంచకప్ లీగ్ స్టేజ్ ముగింపుకు చేరుకుంది. ఇప్పటికే మూడు టీమ్‌లో సెమీస్‌కు చేరుకున్నారు. నాలుగో స్థానం కోసం భారత్, న్యూజిలాండ్, శ్రీలంకలు పోటీపడుతున్నాయి. ఇక టోర్నీ నుంచి బంగ్లాదేశ్, పాకిస్తాన్ వెళ్ళిపోయాయి. దీంతో పాటూ ఈ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఇండియాలోనే జరగనుంది. ఫైనల్ మ్యాచ్‌కు నవీ ముంబయ్ ఆతిథ్యం ఇవ్వనుంది. పాకిస్తాన్‌ టోర్నీ నుంచి నిష్క్రమించడంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ పాక్‌ ఫైనల్‌కు చేరుకుంటే.. ఆ మ్యాచ్‌ను కొలంబోలో నిర్వహించాల్సి ఉండేది. అయితే ఇప్పుడు ఇక ఆ సమస్య లేదు. మరోవైపు సెమీస్ వేదికను ఇంకా ఖరారు చేయలేదు. రెండు సెమీస్ మ్యాచ్‌లలో మొదటి దానికి ఇండోర్, రెండోది ముంబయ్‌లోనే జరిగి అవకాశం ఉందని చెబుతున్నారు. నవంబర్‌ 2న మహిళల వన్డే ప్రపంచకప్ జరగనుంది. 

టాప్ 4 కోసం టీమ్ ఇండియా..

భారత వన్డే వరల్డ్‌ కప్‌లో భారత జట్టుకు పెద్దగా కలిసి రాలేదు. మొదటి రెండు మ్యాచ్‌లను మాత్రమే గెలిచింది. తరువాత మూడింట్లో ఓడిపోయింది. దీంతో సెమీస్‌కు వెళ్ళే అవకాశాలను టీమ్ ఇండియా సంక్లిష్టం చేసుకుంది. ఈక్రమంలో గురువారం భారత మహిళల జట్టు న్యూజిలాండ్‌తో మ్యాచ్ ఆడనుంది. ఇందులో ఎవరు గెలిస్తే వారు సెమీస్‌కు చేరుకుంటారు. న్యూజిలాండ్ కూడా టాప్ కోసం పోటీ పడే టీమ్‌లలో ఒకటి. ఈమ్యాచ్‌లో కూడా టీమ్ ఇండియా ఓడిపోతే సెమస్ బెర్త్ కష్టమౌతుంది. ఇక చివరి లీగ్‌ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో టీమ్‌ఇండియా అక్టోబర్ 26న తలపడనుంది.

Also Read: BIG BREAKING: కశ్మీర్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ వరకు భారీ భూకంపం!

Advertisment
తాజా కథనాలు