BIG BREAKING: కశ్మీర్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ వరకు భారీ భూకంపం!

కశ్మీర్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ వరకూ అర్థరాత్రి భూకంపం కుదిపేసింది. కాశ్మీర్‌లోని శ్రీనగర్, జమ్మూ, బారాముల్లా వంటి ప్రాంతాలలో ప్రకంపనలు సంభవించాయి. ఇస్లామాబాద్, లాహోర్, పెషావర్‌తో సహా అనేక పాకిస్తాన్ నగరాల్లో కూడా ప్రకంపనలు సంభవించాయి.

New Update
earth quake

నిన్న రాత్రి ఆసియా దేశాల్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతతో కాశ్మీర్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ వరకూ భూకంపం వచ్చింది. కాశ్మీర్‌లోని శ్రీనగర్, జమ్మూ, బారాముల్లా వంటి ప్రాంతాలలో ప్రకంపనలు సంభవించాయి. ఇస్లామాబాద్, లాహోర్, పెషావర్‌తో సహా అనేక పాకిస్తాన్ నగరాల్లో కూడా ప్రకంపనలు సంభవించాయి. ఈ భయానికి ప్రజలు తమ ఇళ్ళల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం కేంద్రం ఆఫ్ఘనిస్తాన్‌లో ఉందని తెలుస్తోంది. 

భవనాలలో పగుళ్ళు...

ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ ఆస్తి నష్టం బాగానే సంభవించినట్లు తెలుస్తోంది. పలు ప్రాంతాల్లో భవనాలలో పగుళ్ళు వచ్చాయి. దాంతో పాటూ విద్యుత్ అంతరాయం కూడా కలిగింది. 6.1 తీవ్రతతో భూకంపం వచ్చినప్పటికీ దాని ప్రభావం భూమి ఉపరితలం మీద మాత్రం ఎక్కువగా పడలేదని నిపుణులు చెబుతున్నారు. టెక్టోనిక్ ప్లేట్ కదలిక స్థిరంగా ఉండే హిమాలయ బెల్ట్‌లో భాగం కాబట్టి ఈ ప్రాంతం ఎల్లప్పుడూ భూకంపాల ప్రమాదంలో ఉందని భూకంప శాస్త్రవేత్తలు అంటున్నారు.  

Also Read: Russia-Ukraine War: ట్రంప్, పుతిన్ బుడాపెస్ట్ మీట్ క్యాన్సిల్..టైమ్‌ వేస్ట్‌ అన్న అమెరికా అధ్యక్షుడు

Advertisment
తాజా కథనాలు