/rtv/media/media_files/2025/02/05/N6W5Uoj9rdfFNGRn6Tl3.jpg)
india vs england 2nd odi tickets sale stampede in barabati stadium
ఇంగ్లాండ్‌తో ఇటీవల జరిగిన టీ20 సిరీస్‌ను టీమిండియా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ రెండు జట్లు వన్డే సిరీస్ కు సిద్ధంగా ఉన్నాయి. స్వదేశంలో ఈ సిరీస్ జరగనుండటంతో భారత క్రికెట్ ఫ్యాన్స్ అధిక స్థాయిలో పోటెత్తనున్నట్లు సమాచారం.
Also Read: Delhi: ఢిల్లీ ఎన్నికల పోలింగ్ షురూ..కేజ్రీవాల్ పై హర్యానాలో ఎఫ్ ఐఆర్
ఇక ఈ సిరీస్‌లో భాగంగా తొలి వన్డే మ్యాచ్ నాగ్‌పూర్ వేదికగా జరగనుంది. అలాగే ఇందులోని రెండో వన్డే మ్యాచ్ ఒడిశాలోని కటక్ వేదికగా ఏర్పాటు చేయనున్నారు. అయితే చాలా కాలం తర్వాత కటక్ వేదికగా అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహిస్తుండటంతో క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం పెరిగిపోయింది.
Also Read: Cinema: తండేల్ సినిమా టికెట్ల రేట్ల పెంపుకు ఓకే చెప్పిన గవర్నమెంట్
ఆసక్తిగా క్రికెట్ ఫ్యాన్స్
దీంతో ఎప్పుడెప్పుడు ఆ మ్యాచ్‌ను తిలకిద్దామా? అని ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా ఆ మ్యాచ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడనుండటంతో మరింత మంది వారి ఆటను చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు. ఈ క్రమంలో ఆ మ్యాచ్ కోసం ఆఫ్‌లైన్ టికెట్ల కౌంటర్‌ను ఓపెన్ చేశారు.
Also Read: మూడు గ్రూపులుగా ఎస్సీలు.. ఏ కులం ఏ గ్రూపులో ఉందో తెలుసా?.. ఫుల్ లిస్ట్ ఇదే!
कटक में दूसरे वनडे की टिकट के लिए भगदड़ जैसी स्थिति। 15 लोगों के घायल होने की सूचना आ रही है।#INDvsENGpic.twitter.com/BV2hPonUE1
— Abhishek Tripathi / अभिषेक त्रिपाठी (@abhishereporter) February 5, 2025
గందరగోళ పరిస్థితి
దీంతో టికెట్లు కొనేందుకు క్రికెట్ ఫ్యాన్స్ భారీ స్థాయిలో బారాబతి స్టేడియానికి చేరుకున్నారు. టికెట్ల కోసం రాత్రి నుంచే స్టేడియం వద్ద బారులు తీరారు. ఈ క్రమంలోనే అక్కడ భారీగా క్రికెట్ ప్రియులు రావడంతో గందరగోళ పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం. అదే సమయంలో వారిని అదుపు చేయడం పోలీసులకు కాస్త కష్టంగా మారింది.
వాటర్ గన్స్ ప్రయోగం
దీంతో పోలీసులు అక్కడున్న జనాన్ని చెదరగొట్టేందుకు వాటర్ గన్స్ ప్రయోగించినట్లు సమాచారం. ఈ తరుణంలోనే అక్కడ తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పలువురు స్పృహ కూడా కోల్పోయినట్లు సమాచారం. ప్రస్తుతం అందుకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
Follow Us