భారత్ - ఆస్ట్రేలియా మధ్య అడిలైడ్ వేదికగా ఓవల్ మైదానంలో రెండో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసింది. 337 పరుగులకు 157 పరుగుల ఆధిక్యం సాధించింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ను స్టార్ట్ చేసిన టీమిండియా పేవలమైన బ్యాటింగ్ చేసింది. Also Read : 'పుష్ప2' జాతర ఎపిసోడ్.. ఆడియన్స్ రెస్పాన్స్ చూసి మురిసిపోయిన బన్నీ, వీడియో వైరల్ 5 వికెట్ల నష్టానిక 128 పరుగులు కేవలం 128 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి ఓటమికి దగ్గరలో ఉంది. రెండో రోజు తొలి బ్యాటింగ్‌లో విఫలమైన టీమిండియా.. ఆ తర్వాత బౌలింగ్‌లోనూ చేతులెత్తేసింది. దీంతో మ్యాచ్ ఆసీసీ చేతిలోకి వెళ్ళిపోయింది. ప్రస్తుతం భారత్ 29 రన్స్ వెనకబడి ఉంది. Also Read: అధిక కోపం ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపుతుంది? ఇక రెండో రోజు ఆట ముగిసే సరికి పంత్, నితిశ్ రెడ్డి ఉన్నారు. ఇందులో పంత్ 28 రన్స్, నితీశ్ రెడ్డి 15 రన్స్‌తో క్రీజులో ఉన్నారు. ఇక ఆస్ట్రేలియా బౌలర్లు చెలరేగిపోయారు. పాట్ కమిన్స్ రెండు వికెట్లు, స్కాట్ బోలాండ్ రెండు వికెట్లు తీశారు. అలాగే మిచెల్ స్టార్క్ ఒక వికెట్ పడగొట్టాడు. దీంతో టీమిండియా 5 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. ఇది కూడా చదవండి: పాలన ప్రజా విజయోత్సవాలకు కేంద్రమంత్రులు.. పొన్నం ఆహ్వానం! ఆస్ట్రేలియా బౌలర్ల దాటికి టీమిండియా బ్యాటర్లు ఏ ఒక్కరూ కనీసం 30 పరుగులు చేయలేకపోయారు. కేఎల్ రాహుల్ (7), జైశ్వాల్ (24), కోహ్లీ (11), గిల్ (28), రోహిత్ శర్మ (6) పరుగులు చేసి ఔటయ్యారు. ఇది కూడా చదవండి: తెలంగాణలో మరోసారి భూకంపం.. భయంతో పరుగులు ఇదిలా ఉంటే ఈ పింక్ బాల్ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్‌ను ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగులకే టీమిండియా కుప్పకూలింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 337 పరుగులు చేసి.. 157 పరుగుల ఆధిక్యం సాధించారు.