ప్రజాపాలన విజయోత్సవాలకు కేంద్రమంత్రులు.. పొన్నం ఆహ్వానం!

ప్రజాపాలన విజయోత్సవాలకు రావాలంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానించారు. హైదరాబాద్ లోని కిషన్ రెడ్డి ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా ఆహ్వానం పలికారు. దీనిపై కిషన్ రెడ్డి సానూకూలంగా స్పందించినట్లు సమాచారం.

author-image
By srinivas
New Update
erererrereqw

TG News: ప్రజాపాలన విజయోత్సవాలకు కేంద్రమంత్రులు రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో పాల్గొనాలంటూ హైదరాబాద్ ఇన్చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం హైదరాబాద్ లోని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆహ్వానించారు. పొన్నంతోపాటు ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రజా సంబంధాల సలహాదారు వేణుగోపాల్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ప్రోటోకాల్ అధికారి వెంకట్ రావు ,హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురశెట్టి వెళ్లారు. 

డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ..

ఈ మేరకు  సచివాలయంలో ఈ నెల 9న ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రావాలని మాజీ సీఎం కేసీఆర్‌ సహా కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లను ఆహ్వానిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇక డిసెంబర్ 7,8,9 తేదీల్లో ప్రజాపాలన విజయోత్సవాలను ఘనంగా జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా మూడు రోజుల పాటు నిర్వహించనున్న ప్రజాపాలన విజయోత్సవాలకు ప్రతిపక్ష నేత కేసీఆర్‌ను ఆహ్వానించబోతున్నట్లు తెలుస్తోంది. మంత్రి పొన్నం ప్రభాకర్‌ శనివారం మధ్యాహ్నం ప్రభుత్వం తరఫున కేసీఆర్‌ ఇంటికి వెళ్లనున్నారు. ఆహ్వానపత్రికను అందించేందుకు శుక్రవారం కేసీఆర్‌ కార్యాలయాన్ని సమయం అడగగా శనివారం మధ్యాహ్నం 2 గంటలకు రావాలని సమాధానమిచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 

ఇది కూడా చదవండి: ప్రపంచ ధ్యాన దినోత్సవం.. ప్రకటించిన ఐరాస

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు