/rtv/media/media_files/2025/05/05/BEdhQZ87isolBCfj2SsM.jpg)
ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్న మహ్మద్ షమీని చంపేస్తామని బెదిరింపు మెయిల్ వచ్చిందని అతని సోదరుడు హసీబ్ తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 2-3 గంటల ప్రాంతంలో మెయిల్ వచ్చిందని వెంటనే అమోర్హా పోలీసులకు ఫిర్యాదు చేశారని షమీ సోదరుడు వెల్లడించాడు. మెయిల్ లో షమీ కుటుంబం నుండి రూ. కోటి డిమాండ్ చేశారు.
ఇది కూడా చూడండి: VIRAL VIDEO: వెడ్డింగ్ షూట్‌లో విషాదం.. వధువుపై పేలిన బాంబు.. వీడియో వైరల్
Indian cricketer Mohammed Shami has been threatened through mail. On Sunday evening he received a mail from a person named Rajput Sindhar in which he has been threatened with death. Shami is currently playing IPL. #MohammedShami #SRHvDC pic.twitter.com/jJpHiICJQM
— Sachin sharma (Sports and political journalist) (@72Sachin_sharma) May 5, 2025
వరుసగా రెండు ఈమెయిల్స్
డబ్బు చెల్లించకపోతే చంపేస్తామని అతన్ని బెదిరించారు. భారత పేసర్‌కు ఇమెయిల్ ద్వారా పంపిన బెదిరింపులకు సంబంధించి పోలీసులు ప్రస్తుతం ఈ విషయాన్ని పరిశీలిస్తున్నారు. మహ్మద్ షమీకి వరుసగా రెండు ఈమెయిల్స్ ద్వారా హత్య బెదిరింపులు వచ్చాయి. మొదటి మెయిల్ అతనికి మే 4 సాయంత్రం, రెండవది మే 5 ఉదయం వచ్చింది. ఢిల్లీతో మ్యాచ్ కు ముందు మహ్మద్ షమీకి బెదిరింపుల మెయిల్ రావడం కలకలం రేపింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇది కూడా చూడండి: Naa Anveshana: యూట్యూబర్ అన్వేష్ అడ్డంగా దొరికేశాడు.. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వీడియో వైరల్!
Also Read : కాలేజ్ కుర్రాళ్ల కోసం బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. రూపాయి ఖర్చు లేకుండా రయ్ రయ్!
Also read : TGSRTC : బస్సు భవన్ వద్ద ఉద్రిక్తత...ఒక్కసారిగా వందలాది మంది కార్మికులు..
mohammed-shami | death-threats | sunrisers-hyderabad | IPL 2025 | telugu-news