Cricket: నేడే భారత్-ఇంగ్లాండ్  రెండో టీ 20

టీమ్ ఇండియా క్రికెట్ జట్టులో ప్రస్తుతం కుర్రాళ్ళు మంచి ఫామ్ లో ఉన్నారు. సీనియర్లు ఫెయిల్ అవుతున్నా పొట్టి ఫార్మాట్ లో కుర్రాళ్ళు మాత్రం అదరగొడుతున్నారు. ఇంగ్లాండ్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో గెలిచిన భారత టీమ్ రెండో మ్యాచ్ లో కూడా గెలవాలని అనుకుంటోంది.

New Update
cricket

India Vs England T20 Series

ప్రస్తుతం ఇండియా వేదికగా ఇంగ్లాండ్, భారత్ టీ20 మ్యాచ్ లు జరుగుతున్నాయి. కోలకత్తాలో జరిగిన మొదటి మ్యాచ్ లో టీమ్ ఇండియా అదరగొట్టింది. ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. భారత బ్యాటర్ అభిషేక్ వర్మ అద్బుతమైన బ్యాటింగ్ చేసి టీమ్ ను విజయం దిశగా నడిపించాడు. 

ఈరోజు రెండో టీ20 మ్యాచ్..

ఈ రోజు చెన్నై వేదికగా ఇంగ్లాండ్ తో టీమ్ ఇండియా రెండో మ్యాచ్ ఆడనుంది. ఐదు మ్యాచ్ ల సీరీస్ లో 1-0 తేడాతో ఇప్పటికే అధిక్యంలో ఉంది భారత జట్టు. ఇదే ఉత్సాహంలో రెండో మ్యాచ్ గెలిచి మరింత ముందుకు వెళ్ళాలని చూస్తోంది. మోవైపు మొదటి మ్యాచ్ ఓటమి నుంచి బయటపడి రెండో మ్యాచ్ లో అయినా గెలవాలని పట్టుదలగా ఉంది ఇంగ్లాండ్ టీమ్. ఈడెన్‌ గార్డెన్స్‌లో  బౌలింగ్‌లో విజృంభించి, బ్యాటింగ్‌లో రెచ్చిపోయిన సూర్యకుమార్ టీమ్.. 43 బంతులుండగానే విజయాన్నందుకుంది. కోల్‌కతా మ్యాచ్ లో స్పిన్నర్లు రెచ్చిపోయారు. అక్కడ పిచ్ కూడా వారికి బాగా సహకరించింది. ఇప్పుడు చెన్నై పిచ్  కూడా స్పిన్నర్లకు సహకరించేది.  ఇది టీమ్ ఇండియాకు అనుకూలించే విషయం. అందుకే ఈ మ్యాచ్ లో కూడా ఇంగ్లిష్‌ జట్టుకు చెక్‌ పెట్టి మరో విజయాన్ని ఖాతాలో వేసుకోవాలని టీమ్‌ఇండియా చూస్తోంది.

చెన్నైలో ఈ రోజు జరిగే మ్యాచ్ లో సీనియర్ ఫాస్ట్ బౌలర్ మ్మద్ షమి దిగే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. దాదాపు ఏడాది తర్వాత షమి జట్టులోకి వచ్చాడు. అసలు మొదటి మ్యాచ్ లోనే షమి ఆడాలి. కానీ అక్కడ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని అతనిని బరిలోకి దింపలేదు. ఇప్పుడు చన్నై పిచ్ కడా స్పిన్నర్లే అనుకూలిస్తుంది. అయినా కడా షమిని జట్టలోకి తీసుకుని ఆడిస్తారని చెబుతున్నారు.  అయితే షమి ఆడితే నితీష్ కుమార్ లేదా రింకూ సింగ్ త్యాగం చేయాల్సి వస్తుంది.

Also Read: మేడ్చల్ యువతి హత్య కేసులో వెలుగులోకి కీలక విషయాలు..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు