ఆస్ట్రేలియాతో జరిగిన సిడ్నీ టెస్టులో భారత్ పరాజయమైంది. దీంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమిండియా 1-3 తేడాతో కోల్పోయింది. ఇక ఈ చివరి టెస్టు ఓటమి అనంతరం టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మీడియాతో మాట్లాడారు. జట్టులోని సీనియర్ ప్లేయర్స్ అయిన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చూడండి: పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల్లో మార్పులు ప్లేయర్ భవిష్యత్తుపై మాట్లాడను తాను ఏ ప్లేయర్ భవిష్యత్తుపై మాట్లాడనని అన్నారు. అది వారిపై ఆధారపడి ఉంటుందని అన్నారు. అంతేకాకుండా నిబద్ధత, తపన ఉంటే.. వారు భారత క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైనవి చేస్తారని చెప్పుకొచ్చారు. అది మాత్రమే కాకుండా డ్రెస్సింగ్ రూమ్‌లో తాను అందరితోనూ ఎంతో సంతోషంగా ఉంటానని అన్నారు. ఇది కూడా చూడండి: ఇన్‌స్టాంట్ కాఫీ తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త! నిజాయితీగా ఉంటా ప్రతి ఒక్కరితోనూ నిజాయితీగా ఉంటానని అన్నారు. ప్రతి ప్లేయర్‌ని సమానంగా చూస్తానని.. పెద్ద ఆటగాడు, చిన్న ఆటగాడు అనే తేడా తనకు ఉండదని చెప్పుకొచ్చారు. అయితే బుమ్రా లేకపోవడం వల్లనే ఓడిపోయామని చెప్పనని.. కానీ అతడు ఉంటే బాగుండేదని తెలిపారు. అయినా తమకు 5గురు బౌలర్లు ఉన్నారని.. మంచి జట్టు ఉందని అన్నారు. ఇది కూడా చూడండి: SBIలో 14 వేల క్లర్క్ ఉద్యోగాలు.. మూడు రోజులే ఛాన్స్! అంతేకాకుండా ఏదైనా విషయంలో తప్పుంటే ఆ తప్పును ముందుగా అంగీకరించేది తానేనని చెప్పుకొచ్చారు. ఇక సిరీస్‌లో గెలిచే అవకాశాలు చాలానే వచ్చాయని.. మొదటి విజయంతో సిరీస్ మొదలు పెట్టామని అన్నారు. ఏది ఏమైనా తమ జట్టులో చాలా మంది కుర్రవాళ్లకు ఇది తొలి పర్యటన అని చెప్తూ.. మొత్తంగా తమ జట్టు మరింత మెరుగుపడాల్సి ఉందని తెలిపారు. ఇది కూడా చూడండి: మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో హైడ్రా కూల్చివేతలు ఇక ఈ సిరీస్‌లో సిరాజ్ అద్భుతమైన ఆటతీరు కనబరిచాడని.. బుమ్రా అయితే అదరగొట్టేశాడని పేర్కొన్నారు. అలాగే జైశ్వాల్ భారీ పరుగులు రాణించాడని తెలిపారు. ఇంతకు మించి జట్టు భవిష్యత్తు గురించి మాట్లాడటం బాగోదన్నారు.