/rtv/media/media_files/2025/07/27/pant-rishab-2025-07-27-14-54-57.jpg)
మాంచెస్టర్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తూ టీమిండియా కెప్టెన్ రిషబ్ పంత్ గాయపడిన సంగతి తెలిసిందే. పంత్ తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కాలికి గాయమైంది. అయినప్పటికీ అతను రెండో రోజు ఆటలో బ్యాటింగ్‌కు వచ్చి కీలకమైన అర్ధ సెంచరీ (54 పరుగులు) చేశాడు. కానీ వికెట్ కీపింగ్ బాధ్యతలను మాత్రం ధ్రువ్ జురెల్‌కు అప్పగించాడు.ప్రస్తుతం భారత్ రెండో ఇన్నింగ్స్ లో పోరాడుతుంది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 2 వికెట్ల నష్టానికి 174 పరుగులతో కొనసాగుతోంది. క్రీజ్‌లో కేఎల్ రాహుల్ (87*), శుభ్‌మన్ గిల్ (78*) ఉన్నారు. ఇంకా 137 పరుగులు వెనుకబడి ఉంది భారత్. ఐదో రోజు భారత ఆటగాళ్లు కచ్చితంగా రెండుసెషన్లపాటు బ్యాటింగ్ చేయాల్సిందే. లేదంటే భారత్ ఓటమని ఎదురుకోవాల్సి వస్తుంది.
జట్టుకు అతని అవసరం ఉంది
అయితే రెండో ఇన్నింగ్స్ లో రిషబ్ పంత్ బ్యాటింగ్ కు వస్తాడా లేదా అనే అనుమానం చాలా మందిలో నెలకొంది. అయితే రిషబ్ పంత్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగుతాడని భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ స్పష్టం చేశారు. గాయం తీవ్రంగా ఉన్నప్పటికీ, జట్టుకు అతని అవసరం ఉందని, అందుకే అతను బ్యాటింగ్‌కు దిగుతాడని కోచ్ కొటక్ తెలిపారు. పంత్‌కు కాలికి ఫ్రాక్చర్ అయినట్లు స్కాన్‌లలో తేలింది. దీని కారణంగా అతను కనీసం 6-8 వారాల పాటు ఆటకు దూరంగా ఉండవచ్చని ముందుగా వార్తలు వచ్చాయి. అయితే, వీటిపై బీసీసీఐ ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అవసరమైతే మాంచెస్టర్ టెస్టులో బ్యాటింగ్ చేస్తాడని ఇంతకుముందే చెప్పిన సంగతి తెలిసిందే.
ఇక ఇంగ్లాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌట్ కాగా, ఇంగ్లాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 669 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇందులో కెప్టెన్ బెన్ స్టోక్స్ (141 పరుగులు) అద్భుతమైన సెంచరీ సాధించాడు. జో రూట్ (150), బెన్ డకెట్ (94), జాక్ క్రాలీ (84), ఓలీ పోప్ (71) కూడా భారీ స్కోర్లు చేశారు.