/rtv/media/media_files/kkDmvjJWiXh9xBz1UnYS.jpg)
KTR
KTR: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో భారతరాష్ర్ట సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామరావు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా ఈ రోజు ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కేటీఆర్ చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో వరంగల్ లో కేటీఆర్ పర్యటనను అడ్డుకుంటామని జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గతంలోనే వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ పర్యటన ఉద్రిక్తతకు దారితీసే అవకాశం ఉందన్న కారణంగా భారీగా పోలీసులను మొహరించనున్నారు.
Also Read: వీర మల్లుకు షాక్.. తొలి రోజు సునామీ.. రెండో రోజు సైలెంట్!
కాగా కేటీఆర్ ఈ రోజు పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న నేపథ్యంలో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. ఈ పర్యటన సందర్భంగా కేటీఆర్ కుట్టు మిషన్ల పంపిణీ , విగ్రహ ఆవిష్కరణ, కార్యకర్తల సమావేశాల్లో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు, కేటీఆర్ లలిత కన్వెన్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.అనంతరం, ఉదయం 11:30 గంటలకు భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలం, ఇస్సిపేట గ్రామంలో ఏర్పాటు చేసిన మాజీ సర్పంచ్ కీ.శే. కొడారి కొమురయ్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు.
Also Read: వీర మల్లుకు షాక్.. తొలి రోజు సునామీ.. రెండో రోజు సైలెంట్!
మధ్యాహ్నం 12:00 గంటలకు, మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ సాయి గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొని కార్యకర్తలకు దిశానిర్ధేశం చేస్తారు. ఈ సమావేశంలో పార్టీ కార్యకర్తలతో సమీక్ష జరిపి, రాజకీయ వ్యూహాలపై చర్చించే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలపై అవగాహన కలిపించనున్నారు. అనంతరం, మధ్యాహ్నం 2:00 గంటలకు భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగే మరో కార్యకర్తల సమావేశంలో కూడా ఆయన పాల్గొంటారు. ఈ సమావేశంలో జిల్లా స్థాయిలో పార్టీ కార్యాచరణను బలోపేతం చేసేందుకు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చని అంచనా. ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో, ఈ పర్యటన బీఆర్ఎస్ పార్టీకి మరింత బలాన్ని చేకూర్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే కేటీఆర్ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి వ్యతిరేకత ఎదురు కాకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
Also Read: Kingdom: ఏ నా కొడుకూ ఆపలేరంటూ..విజయ్ దేవరకొండ మళ్ళీ బలుపు మాటలు