Kingdom: ఏ నా కొడుకూ ఆపలేరంటూ..విజయ్ దేవరకొండ మళ్ళీ బలుపు మాటలు

సినిమా ప్రమోషన్స్ లో నోటికొచ్చినట్టు మాట్లాడ్డం రౌడీ హీరో విజయ్ దేవరకొండకు కొత్తేమీ కాదు. ఇప్పుడు తాజాగా రిలీజ్ అవుతున్న కింగ్ డమ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కూడా..ఏ నా కొడుకు నన్నాపలేడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. 

New Update
Kingdom Release Date

Kingdom Release Date

విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కింగ్ డమ్. ఈ సినిమా నాగవంశీ నిర్మిస్తుండగా..అనిరుధ్ మ్యూజిక్ డైరెక్షన్ చేశాడు. కింగ్ డమ్ ట్రైలర్ లాంచ్ నిన్న తిరుపతిలో జరిగింది. ఇందులో రౌడీ హీరో ఎప్పటిలాగే రెచ్చిపోయి మాట్లాడాడు. పుష్ప మూవీలోని అల్లు అర్జున్ స్లాంగ్ లో మాట్లాడాడు. ఈ మూవీ చేస్తున్న ఏడాది నుంచి నా మనసులో ఒకటే అనుకుంటున్నా. ఇప్పటి వరకు దాన్ని బయటకు చెప్పలేదు. మీకు చెబుతున్నా. ఈ సారి మన తిరుపతి ఏడు కొండల వెంకన్న నా వెనకుండి నడిపించినాడా.. చానా పెద్దోన్నై పూడుస్తా సామీ  అంటూ డైలాగ్ లు చెప్పాడు. 

నన్నెవడూ ఆపలేడు..

కింగ్ డమ్ మూవీకి ప్రాణం పెట్టి పనిజేశా అని చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ. ఈ సారి మూవీ కోసం పెద్ద వాళ్లే పనిచేస్తున్నారు. డైరెక్టర్ గౌతమ్ తిన్నమూరి, అనిరుధ్, నాగవంశీ, మా ఎడిటర్ నవీన్ నూలి ఇంకాపని జేస్తూనే ఉన్నారు. ఇంక మిగిలింది రెండే రెండు. ఆ వెంకన్న దయ, మీ ఆశీస్సులు. వాటితో ఈ మూవీ పెద్ద హిట్ అయితే ఏ నా కొడుకు నన్ను ఆపలేడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఎప్పటిలానే విజయ్ కామెంట్స్ సోషల్ మీడియాలోనే వైరల్ అవుతున్నాయి. ఈసారి ఎవరిని ఉద్దేశించి ఏ నా కొడుకు ఉన్నాడో అని నెటిజన్లు పోస్టులు పెడుతూ, కామెంట్లు చేస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు