/rtv/media/media_files/2025/02/01/cgw3KMibppM3zFgAh0Bo.jpg)
India bowling coach Morne Morkel clarity on Harshit Rana coming concussion substitute for Shivam Dube
భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత బౌలర్ హర్షిత్ రాణా దుమ్ము దులిపేశాడు. టీమిండియాను విజయపథంలో నడిపించాడు. శివమ్ దూబే స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన అతడు బౌలింగ్‌లో ఇరగదీసేశాడు. ఏకంగా మూడు వికెట్లు తీసి భారత జట్టు ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే మొదటి ఇన్నింగ్స్ లో బ్యాటర్ శివమ్ దూబే హెల్మెట్‌కు బంతి బలంగా తాకడంతో.. అతని బదులు హర్షిత్ ఆడాలని మేనేజ్ మెంట్ నిర్ణయించింది. దీంతో గ్రౌండ్‌లోకి వచ్చిన అతడు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేశాడు.
హర్షిత్ రావడం పట్ల అసంతృప్తి
అయితే శివమ్ దూబేకు బదులు హర్షిత్ రాణా రావడం పట్ల పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలో కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శివమ్ దూబె స్థానంలో బౌలర్‌ను ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. దూబె బ్యాటింగ్ ఆల్‌రౌండర్ కాగా .. హర్షిత్ స్పెషలిస్ట్ పేసర్. ఇది సరిగ్గా లేదనిపిస్తోందని కామెంట్లు పెడుతున్నారు.
Also Read: Karthikeya 3: 'కార్తికేయ-3' పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చిన డైరెక్టర్ చందూ మొండేటి..!
రిఫరీ అనుమతి ఇస్తే చెల్లుతుంది
మరోవైపు ఐసీసీ నిబంధనలు కూడా అదే చెబుతున్నాయి. బ్యాటర్ స్థానంలో బ్యాటర్, బౌలర్ స్థానంలో బౌలర్.. ఆల్ రౌండర్ స్థానంలో ఆల్ రౌండర్ ను మాత్రమే తీసుకోవాలి. కానీ నిన్న మ్యాచ్ లో ఆల్ రౌండర్ కు బదులు బౌలర్ ను తీసుకున్నారు. అయితే రిఫరీ అనుమతి ఇస్తే అది చెల్లుతుంది. సరిగ్గా ఇదే విషయాన్ని తాజాగా భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ చెప్పారు.
దూబెకు తలనొప్పి లక్షణాలు
శివమ్ దూబెకు బ్యాటింగ్ సమయంలో హెల్మెట్‌కు బాల్ తాకిందని.. ఇన్నింగ్స్ సమయంలో అతడికి తలనొప్పి లక్షణాలు వచ్చాయని అన్నాడు. అందువల్లనే అతడికి బదులుగా మరొకరు పేరును రిఫరీకి తెలియజేసాం అని తెలిపాడు. తర్వాత నిర్ణయాన్ని రిఫరీ తీసుకున్నారని అన్నాడు.
ఎవరినైనా ఆడించే అధికారం తమకు లేదని.. తాము కేవలం పేరు ఇవ్వడం వరకేనని అన్నాడు. ఆ తర్వాత మిగతాదంతా మ్యాచ్ రిఫరీ నిర్ణయం తీసుకోవడంలోనే ఉంటుందని చెప్పుకొచ్చాడు. అది తమ చేతుల్లో ఉండదని అన్నాడు. అనుమతి రావడంతోనే ఆ అవకాశాన్ని వినియోగించుకున్నామని మోర్నీ మోర్కెల్ పేర్కొన్నాడు.