/rtv/media/media_files/2025/07/26/india-take-two-wickets-in-the-first-over-of-the-fourth-test-against-england-2025-07-26-17-42-35.jpg)
India take two wickets in the first over of the fourth Test against England
మాంచెస్టర్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో భారత్‌కు భారీ షాక్ తగిలింది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 669 పరుగులకు ఆలౌట్ కావడంతో 311 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ మొదటి ఓవర్‌లోనే రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
Also Read:ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది...సైన్యం కీలక ప్రకటన
భారత్‌కు బిగ్ షాక్..
ఓపెనర్లు యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్ ఇద్దరూ డకౌట్‌గా వెనుతిరిగారు. వోక్స్ వేసిన 0.4 ఓవర్‌కు యశస్వి జైస్వాల్ (0) ఫస్ట్ స్లిప్‌లో రూట్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ నెక్స్ట్ బాల్‌కే సాయి సుదర్శన్ గోల్డెన్ డక్ అయ్యాడు. అతడు సెకండ్ స్లిప్‌లో హ్యారీ బ్రూక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
Also Read:TRFను ఉగ్ర సంస్థగా ప్రకటించుకోండి.. పాక్ సంచలన వ్యాఖ్యలు
ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి భారత బ్యాట్స్‌మెన్ క్రీజులో నిలబడలేకపోయారు. ముఖ్యంగా పిచ్ బౌలర్లకు అనుకూలంగా మారడంతో పరుగులు చేయడం కష్టంగా మారింది. ఈ రెండు వికెట్లు భారత్ ఆశలను మరింత దెబ్బతీశాయి. ప్రస్తుతం భారత్ కోలుకోవడం చాలా కష్టంగా కనిపిస్తోంది. భారీ లక్ష్యంతో పాటు, క్రీజులో కొత్త బ్యాట్స్‌మెన్‌లు ఉండటం జట్టుకు పెద్ద సవాలుగా మారింది.
Also Read:18 ఏళ్లకే పైలట్.. సమైరా సక్సెస్ స్టోరీ ఇదే.. మీ పిల్లలకు తప్పక వినిపించండి!