T20 World Cup 2026: బంగ్లాదేశ్ కు బిగ్ షాక్ ఇచ్చిన ICC.. T20 ప్రపంచకప్లో బిగ్ ట్విస్ట్!

బంగ్లాదేశ్ కు ఐసీసీ పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. వచ్చే నెలలో జరగనున్న టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ లను భారత్ నుంచి శ్రీలంకకు తరలించే సమస్య లేదని తేల్చి చెప్పేసిందని తెలుస్తోంది.  భారత్ లో భద్రతా ముప్పు లేదని అందని చెబుతున్నారు. 

New Update
bangla (1)

2026 T20 ప్రపంచ కప్ కు ఇంకా ఒక నెల కన్నా తక్కువ సమయం మాత్రమే ఉంది.కానీ బంగ్లాదేశ్ సమస్య మాత్రం ఇంకా పరిష్కారం కాలేదు. బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్ ను ఐపీఎల్ నుండి తీసేసిన తర్వాత బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమకు భద్రతా సమస్య ఉందంటూ.. టీ 20 వరల్డ్ కప్ మ్యాచ్ లను భారతదేశం నుండి శ్రీలంకకు తరలించాలని అభ్యర్థించింది. దీనికి సంబంధించి ఐసీసీకి లేఖ రాసింది. అయితే దీనిపై తాజాగా ఐసీసీ స్పందించింది. భారతదేశంలో భద్రతా ముప్పు ఉందనే బంగ్లాదేశ్ వాదనను తిరస్కరించింది. బంగ్లాదేశ్ మ్యాచ్ లను భారతదేశం వెలుపల తరలించేది లేదని చూచాయగా చెప్పేసింది. భద్రతా ముప్పుగా పరిగణించాల్సింది ఏమీ కనిపించడం లేదని తన నివేదికలో తెలిపింది. అయితే ఈ విషయంలో ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటనా మాత్రం చేయలేదు. 

మొండి పట్టుదలతో బీసీబీ..

కానీ దీనికి సంబంధించి ఈ రోజు ఐసీసీ, బీసీబీ మధ్య తీవ్రంగా చర్చలు జరిగాయని తెలుస్తోంది. వరల్డ్ కప్ మొదలవడానికి చాలా తక్కువ సమయమే ఉంది..కానీ మ్యాచ్ ల విషయంలో మాత్రం బీసీబీ మొండిగానే ఉంది. తమ గ్రూప్ దశ మ్యాచ్ లను ఇండియా నుంచి శ్రీలంకకు మార్చాలని పదే పదే అడుగుతూనే ఉంది. బిసిబి తరపున అధ్యక్షుడు మొహమ్మద్ అమీనుల్ ఇస్లాం, ఉపాధ్యక్షులు మొహమ్మద్ షఖావత్ హుస్సేన్, ఫరూఖ్ అహ్మద్, క్రికెట్ ఆపరేషన్స్ కమిటీ డైరెక్టర్, ఛైర్మన్ నజ్ముల్ అబేదిన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నిజాముద్దీన్ చౌదరి తమ వైఖరిని ధృవీకరించారు. భద్రతా సమస్యలే కారణమని నొక్కి మరీ చెప్పారు. దీనికి ఐసీసీ జవాబు చెబుతూ...టోర్నమెంట్ షెడ్యూల్ ఇప్పటికే ప్రకటించబడిందని...ఇప్పుడు కొత్త మార్పులను చేయలేమని చెప్పింది. హోటల్ బుకింగ్‌లు, ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి వీసాలతో పాటూ అవసరమైన అన్ని ఇతర ఏర్పాట్లు ఇప్పటికే చేయబడ్డాయి. ఆకస్మిక మార్పులు ఇప్పుడు దాదాపు అసాధ్యం అని తేల్చి చెప్పేసినట్టు తెలుస్తోంది. 

ఆ దేశ జట్టుకే నష్టం..

ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ముందు ఇప్పుడు రెండే ఆప్షన్లు మిగిలి ఉన్నాయని చెబుతున్నారు. అయితే షెడ్యూల్ ప్రకారం టోర్నమెంట్ ఆడడం లేదా..మొత్తంగా తొలగిపోవడం. ఈ రెండిటిలో ఏం చేస్తుందనేది బంగ్లాదేశ్ బోర్డు మీదనే ఆధారపడి ఉంది. ఒకవేళ కానీ వరల్డ్ కప్ నుంచి బంగ్లా వెళిపోతే... ఆ దేశ క్రికెటర్లకు పెద్ద దెబ్బే తగులుతుంది. పాకిస్తాన్ ను అవాయిడ్ చేసినట్టే బంగ్లాను కూడా చేసే ప్రమాదం ఉంది. ఇకపై అక్కడ మ్యాచ్ లను ఆడడానికి భారత్ వెళ్ళదు. మిగతా దేశాల టీమ్ లు కూడా తగ్గించేసే ప్రమాదం ఉంది. మరోవైపు టీ 20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ వెళిపోతే...ఆ స్థానంలో స్కాట్ లాండ్ ఆడే అవకాశం ఉందని చెబుతున్నారు. 

Also Read: AI Deal: గూగుల్, ఆపిల్ ఏఐ ఒప్పందం...భయపడుతున్న ఎలాన్ మస్క్   

Advertisment
తాజా కథనాలు