ICC కీలక నిర్ణయం.. దోహా సమావేశం వాయిదా

దోహా సమావేశాన్ని ICC వాయిదా వేసింది. మార్చి 25 నుంచి 27 వరకు ఈ మీటింగ్ జరగాల్సి ఉంది. కానీ పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో  సమావేశాన్ని వచ్చే నెలకు వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

New Update
ICC Postpones Doha Meeting Due To Middle East Conflict

ICC Postpones Doha Meeting Due To Middle East Conflict

ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్‌ ప్రకారం జరగాల్సిన దోహా సమావేశాన్ని వాయిదా వేసింది. మార్చి 25 నుంచి 27 వరకు ఈ మీటింగ్ జరగాల్సి ఉంది. కానీ పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో  సమావేశాన్ని వచ్చే నెలకు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. శనివారమే ఈ విషయాన్ని ఐసీసీ సభ్యులకు చెప్పినట్లు సమాచారం.  

Also Read: చరిత్ర సృష్టించిన శాంసన్..  కేఎల్ రాహుల్ రికార్డు సమం!

ICC బోర్డు డైరెక్టర్లు, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌లు, కమిటీ మెంబర్స్, ఇతర సీనియర్ అధికారులు ఈ మీటింగ్‌లో పాల్గొనున్నారు. ఖతార్‌లో కూడా ప్రస్తుతం క్రికెట్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. ఈ క్రమంలోనే ఇంటర్నేషనల్ క్రికెట్‌ మండలి ఈ మీటింగ్‌ను ఖతార్‌లోనే నిర్వహించాలని ఎంచుకున్నట్లు ఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి.

Also Read: టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్‌.. చరిత్ర  సృష్టించిన టీమిండియా!

ఖతార్ క్రికెట్ అసోసియేషన్, ఒలింపిక్‌ కమిటీకి ఐసీసీ సపోర్ట్‌తో ఖతార్‌లో క్రికెట్‌ మంచి పురోగతి సాధించింది. ఈ విషయాన్ని గత నెలలోనే ఐసీసీ ప్రకటన చేసింది. 

Advertisment
తాజా కథనాలు