/rtv/media/media_files/2026/03/08/india-1-2026-03-08-20-21-35.jpg)
టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్‌లో సంజూ శాంసన్ చరిత్ర సృష్టించాడు. వరుసగా మూడు హాఫ్ సెంచరీలు బాది అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. శాంసన్ ప్రస్తుతం కెరీర్ లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. ఈ వరల్డ్ కప్‌లో తను ఆడుతున్న తీరు చూస్తుంటే బౌలర్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. తాజాగా ఆదివారం న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో కేవలం 33 బంతుల్లోనే హాఫ్ సెంటరీ పూర్తి చేసి ఒక అరుదైన ఘనతను అందుకున్నాడు.
ఈ టోర్నీలో సంజూ శాంసన్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో 50 ప్లస్ స్కోర్లు సాధించాడు
మార్చి 1న: వెస్టిండీస్‌పై కోల్‌కతాలో 50 బంతుల్లోనే 97 నాటౌట్.
మార్చి 5న: ఇంగ్లాండ్‌పై ముంబైలో 42 బంతుల్లోనే 89 పరుగులు.
మార్చి 8న (నేడు): ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.
కేఎల్ రాహుల్ సరసన సంజూ:
ఒకే టీ20 వరల్డ్ కప్ ఎడిషన్‌లో వరుసగా మూడు హాఫ్ సెంచరీలు చేసిన రెండో భారత బ్యాటర్‌గా సంజూ రికార్డు సృష్టించాడు. గతంలో 2021 వరల్డ్ కప్‌లో కేఎల్ రాహుల్ (అఫ్గానిస్థాన్, స్కాట్లాండ్, నమీబియాపై) వరుసగా మూడు ఫిఫ్టీలు బాదాడు. ఇప్పుడు ఐదేళ్ల తర్వాత సంజూ ఆ రికార్డును సమం చేశాడు. విరాట్ కోహ్లీ కూడా వరుసగా మూడు 50+ స్కోర్లు చేసినప్పటికీ, అవి రెండు వేర్వేరు వరల్డ్ కప్‌లలో (2016, 2021) వచ్చాయి. కానీ ఒకే టోర్నీలో ఈ ఫీట్ సాధించిన వారిలో రాహుల్ తర్వాత సంజూనే నిలిచాడు.
Follow Us