Cricket: దేశమే ముఖ్యం..పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడేది లేదు..శిఖర్ ధావన్

క్రికెట్ ఆడడం కన్నా నాకు దేశమే ముఖ్యం. దేశం కన్నా ఏదీ ఎక్కువ కాదంటున్నాడు శిఖర్ ధావన్. డబ్ల్యూసీఎల్‌ లో పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడేందుకు తాను సిద్ధంగా లేనని మాజీ క్రికెటర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. 

New Update
sikhar

Sikhar Dhawan

ఇంగ్లాండ్ లో వరల్డ్ ఛాంపియన్స్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో ఈరోజు భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. ఇందులో మాజీలందరూ ఆడనున్నారు. అయితే బీసీసీఐ రూల్ ప్రకారం పాకిస్తాన్ తో ఇండియా ఏ మ్యాచ్ ఆడకూడదు. పహల్గాం దాడి తర్వాత బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు డబ్ల్యూసీఎల్‌ లో రెండు జట్లూ తలపడనుండడంతో ఇప్పటికే చాలా విమర్శలు వచ్చాయి. పాక్ తో మాజీలు మ్యాచ్ ఎలా ఆడుతున్నారంటూ ప్రశ్నలు తలెత్తాయి. డబ్ల్యూసీఎల్‌ లో యువరాజ్ సింగ్ నాయకత్వంలో టీమ్ ఇండియా ఛాంపియన్స్ ఆడుతోంది. ఇందులో మొదటి మ్యాచ్ పాకిస్తాన్ తో పడింది. 

ఆడను గాక ఆడను..

డబ్ల్యూసీఎల్‌ లో టీమ్ ఇండియా ఛాంపియన్స్ లో మాజీ ఆటగాడు శిఖర్ ధావన్ కూడా ఉన్నాడు. అయితే ఈరోజు పాకిస్తాన్ మ్యాచ్ లో మాత్రం శిఖర్ ఆడను అని బీసీసీఐకు తెగేసి చెప్పేశాడు. ఈ లీగ్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌ ఆడకూడదని మే 11నే నిర్ణయం తీసుకున్నానని..ఆ విషయం అప్పుడే మెయిల్ చేశానని చెప్పాడు. ఇప్పటికే అదే నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని తెలిపాడు. తనకు ఆటకన్నా దేశమే ముఖ్యమని...దేశం కంటే ఏదీ ఎక్కువ కాదని తెగేసీ చెప్పేశాడు. ఇదే విషయాన్ని డబ్ల్యూసీఎల్‌ ఆర్గనైజర్లకు చెప్పానని తెలిపాడు. దీనికి డబ్ల్యూసీఎల్ కూడా ఓకే చెప్పింది. అతడి నిర్ణయాన్ని మేం గౌరవిస్తాం. తప్పకుండా మా సహాయ సహకారాలను అందిస్తామని చెప్పింది.   ఈరోజు ఎడ్జ్ బాస్టన్ లో ఈ రోజు రాత్రి తొమ్మిది గంటలకు మ్యాచ్ జరగనుంది. ఒకవేళ ఇందులో టీమ్ ఇండియా ఆడకూడదని నిర్ణయం తీసుకుంటే ఇరు జట్లకూ చెరో పాయింట్ ఇచ్చే అవకాశం ఉంది. 

Advertisment
తాజా కథనాలు