Bangladesh: ఐసీసీ కండీషన్స్‌కు నో చెప్పిన బంగ్లా.. టీ20 వరల్డ్‌కప్‌‌లో ఏదైనా మిరాకిల్ జరగాల్సిందే..

టీ 20 వరల్డ్ కప్ కు సంబంధించి బంగ్లాదేశ్ కండిషన్స్ కు ఐసీసీ నో చెప్పేసింది. భారత్ వచ్చి ఆడాల్సిందేనని తేల్చి చెప్పింది. అయితే బీసీబీ మాత్రం భారత్ కు రామని...ఏమైనా అద్భుతాలు జరగాల్సిందేనని చెబుతోంది.

New Update
bangladesh

టీ20 వరల్డ్ కప్‌ 2026 విషయంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, ఐసీసీ మధ్య పరిస్థితులు మరింత ముదిరాయి. భారత్ నుంచి మ్యాచ్ లు మార్చమని బంగ్లా క్రికెట్ బోర్డుకు తేల్చి చెప్పేసింది. తుది నిర్ణయం తీసుకోవడానికి బీసీబీకి ఒక్క రోజు గడువు ఇచ్చింది. అయితే బీసీబీ మాత్రం ఐసీసీ చెప్పినదానికి ఒప్పుకోవడం లేదు. తాము భారత్ వచ్చే సమస్య లేదని అంటోంది. భద్రతా సమస్యలు ఉన్నాయని అదే పాట పడుతోంది. తాము ఈ నిర్ణయం నుంచి వెనక్కు తగ్గమని అంటోంది. కానీ ఐసీసీ తన నిర్ణయాన్ని తిరిగి పరిగణనలోకి తీసుకుంటుందని బీసీబీ ఇంకా ఆశలు పెట్టుకుంది. ఏదైనా అద్బుతం జరుగుతందని వెయిట్ చేస్తున్నామని బీసీబీ చెబుతోంది. 

మ్యాచ్ వేదికలు మార్చేది లేదు..

నిన్న అన్ని ఫుల్ మెంబర్ స్క్వాడ్ దేశాలతో..ఐసీసీ బోర్డు సమావేశం అయింది. ఇందులో ఓటింగ్ నిర్వహించి మరీ కీలక నిర్ణయం తీసుకుంది. దాని తరువాత 20 జట్లతో జరిగే టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు ఉండవని, బంగ్లాదేశ్ తప్పనిసరిగా భారత్‌కు వచ్చి ఆడాల్సిందేనని ఐసీసీ స్పష్టం చేసింది. భారత్ లో ఎలాంటి భద్రతాపరమైన ముప్పూ లేదని...తమకు తాము ఏదో అనుకుని మ్యాచ్ లను శ్రీలంకకు మార్చమనడం సమంజసం కాదని ఐసీసీ అంది. అందుకే మ్యాచ్ ల వేదిక మార్చే ప్రశ్నే లేదని తేల్చి చెప్పింది. బంగ్లా బోర్డ్ కు ఒక్క రోజు గడువు ఇస్తున్నామని ఏదో ఒకటి తేల్చుకోవాలని అల్టిమేటం ఇచ్చింది. 

మా నిర్ణయమూ మారదు..

ఐసీసీ ప్రకటనపై బీసీబీ కూడా స్పందించింది. బీసీబీ అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం మాట్లాడారు. జై షా నేతృత్వంలోని ఐసీసీ నుంచి ఒక అద్భుతం జరుగుతుందనే ఆశ ఇంకా ఉందని అమినుల్ అన్నారు. ఓటింగ్ ప్రారంభమయ్యే ముందు తమ వైఖరికి గల కారణాలను ఐసీసీ బోర్డుకు వివరించామని..తరువాత ఓటింగ్ ప్రక్రియలోకి వెళ్లకుండా పక్కకు తప్పుకున్నామని తెలిపారు. బంగ్లాదేశ్ ఆటగాళ్ళు, ప్రభుత్వం వరల్డ్ కప్ ఆడాలనే కోరుకుంటున్నాయి. కానీ భారత్ తమకు ఇప్పుడున్న పరిస్థితుల్లో సురక్షితం కాదనే ఈ నిర్ణయం తీసుకున్నామని అమినుల్ చెప్పారు. బంగ్లాదేశ్‌ను ఐర్లాండ్ లేదా జింబాబ్వేతో మార్చి శ్రీలంక గ్రూప్‌లో చేర్చడం సులభమైన మార్గమని తాము సూచించినప్పటికీ, శ్రీలంక క్రికెట్ బోర్డు తమ గ్రూప్‌లో కొత్త జట్టును చేర్చేందుకు నిరాకరించిందని చెప్పుకొచ్చారు. ఐసీసీ ఇచ్చిన గడువులోగా...తమ ప్రభుత్వంతో మరోసారి చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని బీసీబీ తరుఫున అమినుల్ చెప్పారు. 

Also Read: No Tariffs: ఈయూపై సుంకాలు లేవు.. వెనక్కి తగ్గిన ట్రంప్..

Advertisment
తాజా కథనాలు