ధోనీ వల్లే నా కెరీర్ ఎండ్.. స్టార్ హీరోయిన్ సంచలన ఆరోపణలు

హీరోయిన్ లక్ష్మీ రాయ్ ధోనీపై సంచలన ఆరోపణలు చేశారు. ధోనీతో డేటింగ్‌లో ఉన్నట్లు గతంలో రూమర్స్ వచ్చాయని, వాటివల్లే తన కెరీర్ ఎండ్ అయిపోయిందని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. భవిష్యత్తులో తన పిల్లలు ధోనీతో రిలేషన్ ఏంటని అడిగితే ఏమని చెప్పాలని లక్ష్మీ బాధపడ్డారు.

New Update
Laxmi Raai Ms dhoni

Laxmi Raai Ms dhoni

టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే స్టార్ హీరోయిన్ లక్ష్మీ రాయ్ ధోనీపై సంచలన ఆరోపణలు చేశారు. గతంలో తనకు, ధోనీకి రిలేషన్ ఉందని వార్తలు వచ్చాయని.. వాటి వల్ల తన కెరీర్ ఎండ్ అయిపోయిందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇది కూడా చూడండి:  AP BREAKING: ఏపీలో పదవుల జాతర.. 22 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం.. లిస్ట్ ఇదే!

తన జీవితంలో మారని మచ్చలా..

ఈ రూమర్ తన జీవితంలో ఇప్పటికీ మారని ఒక మచ్చలా ఉండిపోతుందని వాపోయారు. భవిష్యత్తులో తన పిల్లలు ధోనీతో రిలేషన్ ఏంటి? ఈ వార్తలు ఏంటని అడిగితే వారికి నేను ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదని లక్ష్మీ రాయ్ బాధపడ్డారు. ఇప్పటికీ అయినా ఇలాంటి పిచ్చి వార్తలు రాయడం ఆపండని లక్ష్మీ రాయ్ మండిపడ్డారు.

ఇది కూడా చూడండి: BIG BREAKING : రాజస్థాన్ పై పాక్ డ్రోన్ దాడులు.. కలెక్టర్ కీలక ప్రకటన- LIVE VIDEO

ఇదిలా ఉండగా.. ధోనీ టీ20 ప్రపంచ కప్ గెలిచిన సమయంలో కొందరు హీరోయిన్లతో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అందులో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే, లక్ష్మీ రాయ్ కూడా ఉన్నారు. దీపికాతో కూడా కొన్ని రోజులు డేటింగ్ చేసినట్లు అప్పట్లో వార్తలు బాగా వచ్చాయి. 

ఇది కూడా చూడండి: Zelensky: రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు ?.. జెలెన్‌స్కీ సంచలన ప్రకటన

అలాగే హీరోయిన్ లక్ష్మీ రాయ్‌తో కూడా డేటింగ్‌లో ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి. వీరిద్దరూ కలిసి పబ్బులు, పార్టీలకు కూడా వెళ్లారని ఫొటోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే లక్ష్మీ రాయ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూ ఇస్తూ.. రూమర్స్‌పై మండిపడ్డారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు