/rtv/media/media_files/2025/04/19/jvkQJWJwR7sCqJ3tSGFb.jpg)
ఇప్పటి వరకు ఓ లెక్క.. ఇక నుంచి ఓ లెక్క. ప్రస్తుతం భారత దేశం ఉన్న ప్రాంతానికి ఎన్ని ఏళ్లు అంటే పురావస్తు శాస్త్రవేత్తలు, చరిత్రకారులు 60వేల ఏళ్లు అని చెబుతున్నారు. కానీ ఓ చరిత్రక ఆనవాళ్లు ఇండియాకు 74వేల సంవత్సరాల చరిత్ర ఉందని నిరూపితమైంది. ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా బేతంచర్ల యాగంటి దగ్గర జ్వాలాపురం అనే గ్రామం కారణంగా. ఉంది. ఆ ఊరిలో ఓ అరుదైన బూడిద దొరుకుతుంది. ఆర్కియాలజిస్ట్ రవి కొరిశెట్టార్ చేసిన పరిశోధనల్లలో రెండు ఆశ్చర్యకరమై విషయాలు అక్కడ వెలుగులోకి వచ్చాయి.
Our civilization can be dated back to 70000 years
— JyotiKarma🚩🇮🇳 (@JyotiKarma7) December 28, 2024
Jwalapuram 👇🏻 pic.twitter.com/dzKF5Vxpjx
ఒకటి.. భారతదేశంలో 74వేల ఏళ్ల క్రితం కూడా జీవరాశి ఉంది. ఆ సమయంలో ఆదిమానవుల పాలీ లిథిక్ యుగం కర్నూల్ జిల్లా ప్రాంతంలో ఉందని ఆధారాలు లభించాయి. ఈ విషయం ఎలా చెప్పగలిగారంటే.. 74 వేల ఏళ్ల క్రితం ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో టోబా అనే అగ్ని పర్వతం పేలింది. ఆ పేలుడు వెదజల్లిన అగ్నిపర్వత లావా భూమండలమంతటా వ్యాప్తి చెందింది. ఆ బూడిద ఒక పొరలా కమ్మేసి సూర్యకాంతి భూమి మీద పడకుండా చేసింది. దాంతో సరైన ఉష్ణోగ్రత లేక మానవ జాతి దాదాపు అంతరించే ప్రమాదంలో పడింది.
కేవలం అతికొద్ది శాతం మంది మనుషులు మాత్రమే ఆ ప్రమాదం నుంచి బతికి బయటపడ్డారు. ఆ లావా బూడిద భారత్‌లో కూడా కొన్ని చోట్ల పడింది. జ్వాలాపురంలో కూడా పెద్ద ఎత్తున ఆ లావా బూడిద దొరికింది. ఇంత పెద్ద మొత్తంలో బూడిద దొరకడం చాలా అరుదు. అగ్నిపర్వత లావా బూడితను స్థానికులు తవ్వి విక్రయిస్తున్నారు. టన్ను భూడిద రూ.వెయ్యి లకు అమ్ముతున్నారు. అదే జ్వాలాపురం గ్రామస్తుల ఉపాది. దాదాపు 90 శాతం పైగా బూడిదను ఇప్పటికే తవ్వేసి అమ్మేశారు. డిటర్జెంట్ పౌడర్, గిన్నెలు తోమే పౌడర్ల తయారీలో ఈ బూడిద వాడతారని స్థానికులు చెబుతున్నారు.
Also read: Hydra: TDP ఎమ్మెల్యేకు హైడ్రా షాక్.. 20 ఎకరాల్లో నిర్మాణాల కూల్చివేత
ఈ బూడిదలో పాలీ లిథిక్ కాలం నాటి ఆదిమానవుల ఆనవాలు లభించాయి. 2002 నుంచి రవి కొరిశెట్టార్‌తో పాటు, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన మైకేల్ పెట్రాగ్లియా సహా మరికొందరు ఇతర శాస్త్రవేత్తలు ఈ స్థలంపై పరిశోధన చేశారు. ఆఫ్రికాలో దొరికిన పనిముట్లకు, జ్వాలాపురంలో దొరికిన వాటికి కూడా పోలికలున్నాయి. లావా బూడిద పొర పైనా, కిందా కూడా మనిషి వాడిన రాతి పనిముట్ల ఆనవాళ్లు కనిపించడంతో శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. శాస్త్రవేత్తలు చెబుతున్నట్టు భారత్‌కు 60వేల ఏళ్లు కాదు... 74 వేల ఏళ్ల క్రితమే మనిషి ఇక్కడ సంచరించాడని కొత్త ప్రతిపాదన ముందుకు తెచ్చింది ఈ జ్వాలాపురం. భారతదేశ రాతి యుగ చరిత్ర దిశనే మార్చింది ఈ ఆర్కియలాజికల్ సైట్. జ్వాలాపురం తవ్వకంలో ఒక మిడిల్ పాలీ లిథిక్ రాయి లభించింది. దానికి దగ్గరలో మరో ఎర్లీ పాలీ లిథిక్ రాయి దొరికింది. ఇక జుర్రేరు నది ఒడ్డున మైక్రో లిథిక్ వస్తువులు కనుగొనబడ్డాయి. యాగంటి పెయింటెడ్ రాక్ షెల్టర్ల దగ్గరలో నేలపై మైక్రో లిథిక్ పరికరాలు కనిపించాయి. ఇవన్నీ ఇప్పటి వరకున్న భారత దేశ రాతియుగ చరిత్రని మార్చబోతున్నాయా అనేదే ఇప్పుడు ప్రశ్న.