/rtv/media/media_files/2025/03/07/7HB4qjM42hwln11xXwVa.jpg)
Harmanpreet Kaur fined for Code of Conduct breach during MI vs UPW clash in WPL 2025
WPL 2025: ప్రస్తుతం ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 జరుగుతోంది. మార్చి 6న ముంబై ఇండియన్స్ vs UP వారియర్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించి టాప్-2లోకి ప్రవేశించింది. అదే సమయంలో మ్యాచ్ తర్వాత ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కి బిగ్ షాక్ తగిలింది. ఆమెపై చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా భారీ జరీమానా విధించారు. దానికి ప్రధాన కారణం ఆమె ప్రవర్తన అని తెలుస్తోంది.
అంపైర్ తో వాదించడం
తన జట్టుకు స్లో-ఓవర్ పెనాల్టీ విధించిన తర్వాత ఎంఐ కెప్టెన్ హర్మన్ ప్రీత్ ఆన్-ఫీల్డ్ అంపైర్ అజితేష్ అర్గల్‌తో వాదించింది. స్లో ఓవర్ రేటు కారణంగా ఎంఐ 20వ ఓవర్‌లో 30 యార్డ్ సర్కిల్ వెలుపల ముగ్గురు ఫీల్డర్లను మాత్రమే ఉంచడానికి అనుమతించబడింది. దీంతో హర్మన్‌ప్రీత్ అంపైర్‌తో వాదించింది. అదే సమయంలో యుపి వారియర్స్‌కు చెందిన సోఫీ ఎక్లెస్టోన్‌తో కూడా వాగ్వాదానికి దిగింది. సోఫీ వైపు కోపంగా చేయి చూపిస్తూ కనిపించింది. దీంతో అంపైర్ తో వాదించి అతని మాట విననందుకు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్మన్‌పై చర్యలు తీసుకున్నారు.
Heated moment between HarmanpreetKaur and Eccelstone in WPL.pic.twitter.com/s5am45ppsc
— Don Cricket 🏏 (@doncricket_) March 7, 2025
Also Read: 'రాబిన్ హుడ్' కోసం హాట్ బ్యూటీని దించారుగా..!
WPL సోషల్ మీడియా
ఇదే విషయాన్ని WPL సోషల్ మీడియా ద్వారా తెలిపింది. "గురువారం లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో యుపి వారియర్జ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ను WPL ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు మందలించడంతో పాటు ఆమె మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించారు" అని ఒక ప్రకటనలో తెలిపింది.
🚨 Mumbai Indians captain Harmanpreet Kaur has been reprimanded and fined 10% of her match fees for Level 1 offence of showing dissent at an umpire's decision.#WPL2025 pic.twitter.com/7FVm1fFJW9
— Women’s CricZone (@WomensCricZone) March 7, 2025
Also Read: మనుషులా మానవ మృగాళ్ల.. మహిళను హత్య చేసి, పాదాలకు మేకులు కొట్టి - చేతిపై సూదితో పొడిచి!
సెక్షన్ 2.8 ప్రకారం
ఆర్టికల్ 2.8 ప్రకారం లెవల్ 1 నేరానికి హర్మన్ ప్రీత్‌కౌర్ అంగీకరించింది. ఇది మ్యాచ్ సమయంలో అంపైర్ నిర్ణయంపై విభేదించడానికి సంబంధించినది. అందులో మ్యాచ్ రిఫరీ నిర్ణయమే తుది నిర్ణయం. దాన్ని ఉల్లంఘించడంతో హర్మన్‌ప్రీత్ కౌర్‌కు ఆమె మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించబడింది.
ముంబై మ్యాచ్ గెలిచింది
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ 18.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఈ మ్యాచ్‌లో ముంబై తరఫున హేలీ మాథ్యూస్ 46 బంతుల్లో 68 పరుగులు చేసి ఇన్నింగ్స్ ఆడింది. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. ముంబై ప్లేఆఫ్స్ వైపు బలమైన అడుగు వేసింది.