ICC: పాక్ క్రికెటర్ రవుఫ్ కు ఐసీసీ పనిష్మెంట్..సూర్యకుమార్, బుమ్రాలకు జరిమానా

ఆసియా కప్ టోర్నీలో నియమాలను ఉల్లంఘించిన క్రికెటర్లు అందరి మీదా ఐసీసీ చర్యలు తీసుకుంది. పాక్ క్రికెటర్ రవుఫ్ పై రెండు మ్యాచ్ ల నిషేధం విధించింది. భారత కెప్టెన్ సూర్యకుమార్, పేసర్ బుమ్రాలకు 30 శాతం ఫీజులో కోత పడింది.

New Update
ICC

రెండు నెలల క్రితం ముగిసిన ఆసియా కప్ చాలా వివాదాలనే రేపింది. ముఖ్యంగా భారత్, పాకిస్తాన్ ల మధ్య గొడవలకు కారణం అయింది. ఆ టోర్నీ కప్ ఇప్పటి వరకు ఇండియాకు చేరనే లేదు. దాంతో పాటూ రెండు దేశాల క్రికెటర్లు పలుసార్లు ఐసీసీ నియమాలను ఉల్లంఘించారు. దీనిపై ఐసీసీ చర్యలు తీసుకుంది. పాకిస్తాన్ క్రికెటర్ రవూఫ్ పై రెండు మ్యాచ్ ల నిషేధంతో పాటూ 30 శాతం ఫీజులో కోత విధించింది. అలాగే భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, పేసర్బుమ్రా, బ్యాటర్‌ ఫర్హాన్‌ చెరో అయోగ్యత పాయింట్‌ పొందిన కారణంగా వారి ఫీజుల్లో కూడా 30 శాతం ఫీజును కోత విధించారు. రవూఫ్‌..ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సీరీస్ లో తొలి రెండు వన్డేలకు దూరమయ్యాడు.

ఆపరేషన్ సింధూర్ పై వ్యాఖ్యలు..

పాకిస్తాన్ తో సెప్టెంబర్ 14న జరిగిన మ్యాచ్ తరువాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గెలుపు పహల్గాంఉగ్రదాడి బాధితుల కుటుంబాలకు, అలాగే ధైర్యసాహసాలు ప్రదర్శించిన మన సాయుధ దళాలన్నింటికీ అంకితం అని తెలిపారు. అతడి మాటలతో క్రికెట్ అభిమానులు, ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. సూర్య కుమార్ మాట్లాడుతూ.. ‘‘పహల్గాం లో జరిగిన ఉగ్రవాద దాడి నన్ను ఎంతో బాధించింది. అందువల్ల బాధితుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఇదే సరైన సందర్భమని నేను ఎంతో భావిస్తున్నాను. ఇక పాక్ క్రికెటర్ రవూఫ్ అదే మ్యాచ్ లో భారత్ ను రెచ్చగొట్టేలా ప్రవర్తించాడు. ఆరు భారత విమానాలను కూలగొట్టామనే అర్థం వచ్చేలా సైగలు చేశాడు. సెప్టెంబర్ 28న జరిగిన మ్యాచ్ లోనే దానినే పునరావృతం చేశాడు. ఆసియా కప్‌ ఫైనల్లో రవూఫ్‌ను బౌల్డ్‌ చేయగానే.. విమానం దూసుకొస్తున్నట్టుగా సంజ్ఞ చేసినందుకు బుమ్రా, భారత్‌తో మ్యాచ్‌లో అర్ధసెంచరీ చేసిన అనంతరం ‘గన్‌ ఫైర్‌’ సంబరాలు చేసుకున్నందుకు ఫర్హాన్‌పై ఐసీసీ చర్యలు తీసుకుంది. పహల్గాం దాడి, ఆరేషన్ సింధూర్ తర్వాత భారత్, పాకిస్తాన్ లు తలపడడంతో...ఇరు దేశాల క్రికెటర్ల మధ్యనా కాస్త ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.

Advertisment
తాజా కథనాలు