/rtv/media/media_files/2025/05/02/xDxWrgjwrLesUZcz9os2.jpg)
ఐపీఎల్ 2025వ సీజన్‌లో భాగంగా ఇవాళ గుజరాత్ టైటాన్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఇందులో భాగంగా మొదటి ఇన్నింగ్ చేస్తున్న GT జట్టు 10 ఓవర్లు పూర్తి చేసుకుంది. ఈ పది ఓవర్లలో 1 వికెట్ల నష్టానికి 120 స్కోర్ చేసింది. ఓపెనర్ సాయి సుదర్శన్ 23 బంతుల్లో 48 పరుగులు చేశాడు. ప్రస్తుతం క్రీజ్‌లో కెప్టెన్ శుభమన్ గిల్, జోష్ బట్లర్ ఉన్నాడు. గిల్ 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకున్నాడు. ఈ వార్త రాసే సమయానికి గిల్ (62), బట్లర్ (21) పరుగులతో ఉన్నారు.
Also read : 12 ఏళ్లుగా పాకిస్తాన్‌కు గూఢచర్యం.. రాజస్థాన్‌లో దొరికిన ఇంటి దొంగ!
SRHకు డూ ఆర్ డై
కాగా ఇది సన్‌రైజర్స్‌కు ఇది డూ ఆర్ డై మ్యాచ్. ఇందులో గెలిస్తే ముందుకు.. లేదంటే ఇంటికి వెళ్లిపోవలసిందే. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడి 3 విజయాలు మాత్రమే సాధించింది. మిగిలిన ఐదు మ్యాచ్‌ల్లో గెలిస్తేనే హైదరాబాద్ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఇక గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవడంపై కన్నేసింది.
Also Read: ఇజ్రాయెల్‌లో భారీ కార్చిచ్చు.. వ్యాపిస్తున్న మంటలు.. ఆందోళనలో వేలాది మంది ప్రజలు
ప్రస్తుతం 12 పాయింట్లతో ఉన్న గుజరాత్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై భారీ తేడాతో గెలిస్తే అగ్రస్థానానికి చేరే అవకాశముంది. ఐపీఎల్‌లో ఇప్పటివరకు గుజరాత్, హైదరాబాద్ జట్ల మధ్య నాలుగు పూర్తి మ్యాచ్‌లు జరిగాయి. అందులో హైదరాబాద్ ఒక్క మ్యాచ్‌లోనే గెలించింది. గుజరాత్ 3 మ్యాచ్‌ల్లో నెగ్గింది.
gt-vs-srh | sports-news | latest-telugu-news | telugu-news