/rtv/media/media_files/2025/04/12/ay9dcVH7WQ2vKE8Pgwut.jpg)
LSG vs GT LIVE SCORE Photograph: (LSG vs GT LIVE SCORE)
లక్నో సూపర్ జెయింట్స్ VS గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన లక్నో జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ జట్టు నిర్దేశించిన 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు సాధించింది. ఇప్పుడు లక్నో ముందు 181 టార్గెట్ ఉంది. గుజరాత్ టైటాన్స్‌పై లక్నో జట్టు గెలిస్తే పాయింట్ల పట్టికలో అగ్ర స్థానానికి వచ్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం లక్నో జట్టు ఐదు మ్యాచుల్లో మూడు మ్యాచ్‌లు గెలిచింది. దీంతో 6 పాయింట్లతో 6వ స్థానంలో ఉంది. ఇక ఇప్పుడు గుజరాత్‌తో మ్యాచ్‌ను సొంతం చేసుకుంటే లక్నో ఖాతాలోకి 8 పాయింట్లు వస్తాయి. అదేే సమయంలో మెరుగైన రన్‌రేట్ సాధిస్తే లక్నో జట్టు మొదటి స్థానానికి దూసుకెళ్తుంది. చూడాలి ఛేజింగ్‌లో లక్నో లక్ ఎలా ఉంటుందో.
ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ టీమ్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. 181 పరుగుల లక్ష్యాన్ని 19.3 ఓవర్లలో చేధించింది. నికోలస్ పూరన్ 61 పరుగులతో సత్తా చాటాడు. మరో మార్క్‌రమ్ 58 పరుగులు చేశాడు. ఇక గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు తీశాడు. రషీద్, సుందర్ ఒక్కో వికెట్ తీశారు.
Also Read: గుజరాత్‌కు మరో షాక్.. టోర్నీ నుంచి ఆల్‌రౌండర్ ఔట్!
మొత్తానికి సొంత గడ్డపై లక్నో టీమ్ గెలిచింది. టేబుల్‌లో ముందు వరుసలో ఉన్న గుజరాత్‌ను ఓడించి టాప్ 4వ స్థానానికి చేరుకుంది. ఫీల్డింగ్‌లో అద్భుతంగా రాణించిన లక్నో.. గుజరాత్ స్కోర్‌ను 180కే కట్టడి చేసింది. పవర్ ప్లేలో గుజరాత్ పేస్ గన్స్, ప్రసిధ్‌లు వేసిన బంతులకి బౌండరీలతో విరుచుకుపడ్డారు.
Also Read: భారీ భూకంపం.. ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని ప్రజలు పరుగే పరుగు- ఎక్కడంటే?
6 ఓవర్లకే లక్నో 62 పరుగులు చేసింది. సుందర్ బౌలింగ్‌లో పంత్ ఔట్ కావడంతో ఆ తర్వాత నికోలస్ పూరన్ వచ్చాడు. 34 బంతుల్లో 61 పరుగులు చేశారు. మరోసారి మర్క్‌రమ్ కూడా దూకుడుగా ఆడాడు. 26 బంతుల్లో 50 స్కోర్ చేశాడు. 10 ఓవర్లకు లక్నో స్కోర్ 114కు చేరింది. చివరికీ 181 పరుగుల లక్ష్యాన్ని 19.3 ఓవర్లలో 6 వికెట్ల తేడాతో లక్నో టీమ్ గెలిచింది.