RR vs GT : చితకొట్టిన గిల్, బట్లర్ .. గుజరాత్ భారీ స్కోర్!

జైపూర్‌లో రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ భారీ స్కోర్ చేసింది.  నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. కెప్టెన్, ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (84) దంచికొట్టాడు. జోస్ బట్లర్ (50*) మరోసారి ఆకట్టుకున్నాడు.

New Update
gt gill

gt gill

RR vs GT: ఐపీఎల్ 2025లో భాగంగా జైపూర్‌లో రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ భారీ స్కోర్ చేసింది.  నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. కెప్టెన్, ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (84) దంచికొట్టాడు. జోస్ బట్లర్ (50*) మరోసారి ఆకట్టుకున్నాడు. సాయి సుదర్శన్ (39) రాణించాడు. రాజస్థాన్ బౌలర్లలో మహీశ్‌ తీక్షణ 2, ఆర్చర్, సందీప్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

Also Read: Samantha Temple బర్త్ డే రోజున సమంతకు ఏకంగా గుడి కట్టించిన అభిమాని.. నెట్టింట వీడియో వైరల్

అదిరిపోయే శుభారంభం

టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన గుజరాత్ కు ఓపెనర్లు అదిరిపోయే శుభారంభాన్ని ఇచ్చారు.  గిల్, సాయి సుదర్శన్ తొలి వికెట్‌కు 93 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలోనే గిల్ తన హాఫ్ సెంచరీ చేశాడు.  97 పరుగుల వద్ద ఈ జోడీకి బ్రేక్ పడింది.  తీక్షణ వేసిన 10.2 ఓవర్‌కు లాంగాన్‌లో రియాన్‌ పరాగ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.  అనంతరం వచ్చిన జోస్ బట్లర్ తో కలిసి గిల్ దూకుడుగా ఆడాడు. మాంచి జోరు మీదున్న బట్లర్..  హసరంగ వేసిన 15 ఓవర్‌లో వరుసగా 6, 6, 4, 6 బాదేశాడు. అతని ఓవర్‌లో మొత్తం 24 పరుగులు వచ్చాయి. ఈ  క్రమంలోనే తీక్షణ బౌలింగ్ లోనే గిల్ ఔటయ్యాడు.  అనంతరం బట్లర్ భారీ షాట్లతో అలరించాడు. ఈ క్రమంలోనే బట్లర్‌ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.  సుందర్ (9), తెవాతియా (9) విఫలమయ్యారు.  

 Also Read:  Balakrishna Padma Bhushan: బాలయ్య బాబుకు అభినందనల వెల్లువ.. ఎవరెవరు విష్ చేశారంటే?

Also Read: Dhanush 56: పుర్రెతో ధనుష్ కొత్త సినిమా పోస్టర్.. నాలుగేళ్ళ తర్వాత మళ్ళీ అదే డైరెక్టర్ తో

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు