/rtv/media/media_files/2025/04/28/XI7eiw3nY2gkLO1ahHVO.jpg)
fan built temple for Samantha
Samantha Temple ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది హీరోయిన్లకు.. హీరో రేంజ్ ఫాలోయింగ్ ఉంటుంది. అలాంటి నటీమణుల్లో సమంత ఒకరు. ఈమెకు సోషల్ మీడియాతో పాటు బయట కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అయితే నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ నుంచి బర్త్ డే విషెష్ వెలువెత్తుతున్నాయి. ఈ క్రమంలో సామ్ బర్త్ డే వేళ ఓ అభిమాని చేసిన పని నెట్టింట అందరి దృష్టిని ఆకర్షించింది. సమంత పుట్టినరోజు సందర్భంగా ఏకంగా ఆమె కోసం గుడి కట్టించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సమంత కోసం గుడి
సందీప్ అనే వ్యక్తి బాపట్ల జిల్లా ఆలపాడు గ్రామంలో సమంత పేరుపై గుడి కట్టి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ సందర్భంగా సందీప్ మీడియాతో మాట్లాడుతూ.. సమంత అంటే తనకెంతో ఇష్టమని, ఆమె చేసే సేవా కార్యక్రమాలను కూడా బాగా ఇష్టపడతానని.. అందుకే ఆమెకు అభిమానిని అయ్యానని తెలిపాడు. ప్రతీ సంవత్సరం సమంత పుట్టినరోజున అనాధాశ్రమాల్లో అన్నదానం కూడా చేస్తానని చెప్పాడు.
సమంత కు గుడి కట్టిన అభిమాని బాపట్ల జిల్లా ఆలపాడు గ్రామంలో హీరోయిన్ సమంత కి పుట్టినరోజు సందర్భంగా సమంతకి గుడి కట్టి అభిమానాన్ని చాటుకున్న తఎం సందీప్ ..తనకి సమంత అంటే ఇష్టమని ఆమె చేసే సేవా కార్యక్రమాలు బాగా ఇష్టమన్నారు అందుకే ఆమెకి ఫ్యాన్ గా మారాను అంటున్నాడు సందీప్ pic.twitter.com/JzSdfcY7ng
— ASHOK VEMULAPALLI (@ashuvemulapalli) April 28, 2025
ప్రత్యూషా స్వచ్ఛంద సంస్థ
సమంత 2012లో "ప్రత్యూషా సపోర్ట్" అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా ఆమె మహిళలు, పిల్లల ఆరోగ్య సంరక్షణకు సహాయం చేస్తున్నారు. ఆమె 2015లో చెన్నై వరదల సమయంలో 30 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు.
telugu-news | cinema-news | HBD Samantha